Samantha: సమంత-రాజ్‌ల వివాహ వార్త విన్న వెంటనే జనం చేసిందేంటో తెలుసా?
మరి యాధృచ్చికమో.. కావాలనే చేసుకున్నారో కానీ సమంత మాజీ భర్త నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల వివాహ వార్షికోత్సవానికి కేవలం మూడంటే మూడు రోజుల ముందు ఆమె వివాహం చేసుకోవడం ఆసక్తిని రేకెత్తించింది.
సమంత-రాజ్ నిడిమోరు వివాహం కోయంబత్తూరులోని ఇషా యోగా సెంటర్‌లో జరిగిందన్న వార్త బయటకు రాగానే జనం మొదట సెర్చ్ చేసిన విషయం ఆసక్తికరంగా మారింది. ఎప్పుడైనా ఎవరైనా ఒక్కసారిగా వైరల్ అయితే తొలుత భారతీయులంతా వెదికేది అతని కులం గురించి.. కానీ రాజ్ నిడిమోరు విషయంలో కాస్త భిన్నంగా జరిగింది.
రాజ్ నిడిమోరుతో దాదాపు మూడేళ్లుగా సమంత డేటింగ్‌లో ఉంది. మొత్తానికి ఈ ఏడాది ఎండింగ్‌లో వివాహం చేసుకుంది. అసలు ఈ ఏడాదే వీరిద్దరూ కలిసి బయటకు రావడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే వీరిద్దరి డేటింగ్ వార్తలు నెట్టింట బాగా వైరల్ అయ్యాయి. అయినా కూడా వీరేమీ సీక్రెసీ మెయిన్‌టైన్ చేయలేదు. దీంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. మొత్తానికి ఇషా ఫౌండేషన్‌లో కేవలం 30 మంది ఆత్మీయుల నడుమ సింపుల్‌గా వీరి వివాహం జరిగింది. అది మరి యాధృచ్చికమో.. కావాలనే చేసుకున్నారో కానీ సమంత మాజీ భర్త నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల వివాహ వార్షికోత్సవానికి కేవలం మూడంటే మూడు రోజుల ముందు ఆమె వివాహం చేసుకోవడం ఆసక్తిని రేకెత్తించింది.
ఇక జనాలు వీరి పెళ్లి తర్వాత ఏం సెర్చ్ చేశారంటారా? రాజ్ నిడిమోరు వయసెంత? సమంతకు రాజ్‌కు మధ్య వయసులో ఎంత వ్యత్యాసం ఉందనే విషయాలను బీభత్సంగా సెర్చ్ చేశారు. సమంత, రాజ్ నిడిమోరు మధ్య ఎనిమిది సంవత్సరాల వయస్సు తేడా ఉంది. సమంత ఏప్రిల్ 28, 1987న జన్మించగా.. ఆమెకు 2025లో 38 సంవత్సరాలు. మరోవైపు, రాజ్ ఆగస్టు 4, 1979న జన్మించాడు. అతనికి ప్రస్తుతం 46 సంవత్సరాలు. ఈ నేపథ్యంలోనే నాగ చైతన్య వయసును కూడా అంతా సెర్చ్ చేశారు. నాగ చైతన్య నవంబర్ 23, 1986న జన్మించాడు కాబట్టి వారిద్దరి మధ్య నెలల వ్యత్యాసం మాత్రమే ఉంది. రాజ్ నిడిమోరుకు కూడా గతంలో అంటే 2015లో శ్యామలి దేతో వివాహం జరిగింది.
రాజ్, శ్యామలికి ఒక బిడ్డ ఉన్నాడంటూ వార్తలు వైరల్ అయ్యాయి. పైగా వీరిద్దరూ ఒక పాపతో ఉన్న పిక్స్ వైరల్ అవడంతో అంతా అవాక్కయ్యారు. సమంత వివాహితుడుతో డేటింగ్ చేస్తోందంటూ పెద్ద ఎత్తున రచ్చ జరిగింది. వాస్తవానికి, 2022లో తన మొదటి భార్య శ్యామలి నుంచి రాజ్ విడాకులు తీసుకున్నారు. అలాగే రాజ్, శ్యామలికి పిల్లలు లేరట. ఫోటోలో కనిపించిన బిడ్డ.. రాజ్ సహ-దర్శకుడు అయిన కృష్ణ డికె కుమార్తె అని తెలుస్తోంది. తొలుత రాజ్, సమంత కాంబోలో ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ వచ్చింది. ఆ తరువాత ‘సిటాడెల్’ సమయంలో రాజ్, సమంతల మద్య ప్రేమ చిగురించినట్టుగా సమాచారం. 2023 నుంచి వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నట్టు సమాచారం.
ప్రజావాణి చీదిరాల