Entertainment

Priyanka Arul Mohan: ట్రోల్స్ అన్నీ డబ్బిచ్చి చేయించుకునేవా? అంత మాట అనేసిందేంటి?

పవన్ కల్యాణ్, సుజీత్ కాంబోలో రూపొందిన ‘ఓజీ’ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే ప్రియాంక మాట్లాడిన ఓ విషయం సంచలనంగా మారింది.

Priyanka Arul Mohan: ట్రోల్స్ అన్నీ డబ్బిచ్చి చేయించుకునేవా? అంత మాట అనేసిందేంటి?

పవన్ కల్యాణ్, సుజీత్ కాంబోలో రూపొందిన ‘ఓజీ’ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్ బీభత్సంగా ప్రమోషన్స్ చేస్తోంది. నేడు (మంగళవారం) ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను ప్రియాంక అరుల్ మోహన్ విలేకరులకు వెల్లడించింది. ఈ క్రమంలోనే ప్రియాంక మాట్లాడిన ఓ విషయం సంచలనంగా మారింది.

ఇక రాజకీయాల (Politics)కు తను చాలా దూరమని ప్రియాంక అరుల్ మోహన్ (Priyanka Arul Mohan) వెల్లడించింది. ఈ మూవీ ప్రారంభానికి ముందే పవన్ స్పీచ్ (Pawan Speech) చూశాను. ఆయన మాట్లాడే గట్స్ చూస్తే నాకు చాలా షాక్ అనిపించింది. పవన్ చాలా సింపుల్ అని.. ఆయన షూటింగ్‌ (OG Shooting)కు వచ్చిన సమయంలో కూర్చోవడానికి కుర్చీ లేకుంటే కింద కూర్చుండి పోయేవారని ప్రియాంక వెల్లడించింది. తాను కూడా వెళ్లి పవన్‌తో పాటే కింద కూర్చొనేదాన్నని తెలిపింది. పవన్ అంత డౌన్ టు ఎర్త్ పర్సన్ అని తెలిపింది. ఇక తాను ఆది నుంచి సోషల్ మీడయా (Social Media)కు చాలా దూరంగా ఉంటానని తెలిపింది. ఈ క్రమంలోనే ప్రియాంక మరో ఆసక్తికర విషయాన్ని సైతం వెల్లడించింది.

ట్రోల్స్‌కు భయపడి సోషల్ మీడియాకు దూరంగా ఉంటారా? అంటే అదంతా ఫేక్ అని చెప్పుకొచ్చింది. డబ్బులు తీసుకుని అలా ట్రోల్స్ చేస్తుంటారని ప్రియాంక షాక్ ఇచ్చింది. డబ్బులు ఎవరిస్తారని అడగ్గా.. ఇచ్చేవారికి.. తీసుకునేవారికి తెలుస్తుందని వెల్లడించింది. మొత్తానికి ప్రియాంక మాటలు చూస్తుంటే కొందరు తాము హైలైట్ అవడం కోసం డబ్బిచ్చి మరీ తమను తామే ట్రోల్ చేయించుకుంటారని తెలుస్తోంది. నిజంగానే అలా జరుగుతోందా? ఎందుకు ఈ ముద్దుగుమ్మ ఇలాంటి కామెంట్ చేసింది? ఇండస్ట్రీలో డబ్బు ఇచ్చి మరీ ట్రోల్ చేయించుకునేవారెవరు? అనేది ఆసక్తికరంగా మారింది. నేచురల్ స్టార్‌ నాని (Natural Star Nani)తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు.. పవర్ స్టార్‌ (Powerstar)తో ఇప్పుడు చేశారు.. నెక్ట్స్ ఎవరితోనని అడగ్గా తనకు తెలియదని నవ్వుతూ ఆన్సర్ చేసింది ప్రియాంక అరుల్ మోహన్.

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
September 16, 2025 11:15 AM