Director Manasa Sharma: ‘రాకాస’ కథ చెప్పలేను.. ట్రైలర్ చూశాక మీకే తెలుస్తుంది..
ఈ చిత్రాన్ని ఓ అందమైన చందమామ కథలాంటి సినిమాగా అభివర్ణించారు. ఇదొక కామెడీ ఫాంటసీ అడ్వెంచర్ చిత్రమని.. థియేట్రికల్‌గా ప్రేక్షకులకు మంచి అనుభూతిని అందిస్తుందని మానస శర్మ తెలిపారు.
మానస శర్మ దర్శకత్వంలో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించిన చిత్రం ‘రాకాస’. ఈ చిత్రం ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌ను వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే మానస శర్మ విలేకరులతో తాజాగా ముచ్చటించారు. ఈ చిత్రాన్ని ఓ అందమైన చందమామ కథలాంటి సినిమాగా అభివర్ణించారు. ఇదొక కామెడీ ఫాంటసీ అడ్వెంచర్ చిత్రమని.. థియేట్రికల్‌గా ప్రేక్షకులకు మంచి అనుభూతిని అందిస్తుందని మానస శర్మ తెలిపారు. కథలో హారర్ అంశాలు ఉంటాయి కానీ ఎంత మేర ఉండాలో అంత మేర మాత్రమే ఉంటాయని మానస శర్మ తెలిపారు.
ఈ కథ పూర్తిగా వినోదాత్మకంగా సాగుతుందని.. కొద్దిగా హారర్ అంశాల్ని మిక్స్ చేసి ఫాంటసీ అడ్వెంచర్‌గా ముస్తాబు చేసినట్టు మానస శర్మ తెలిపారు. నిజానికి ఈ కథను తొలుత నెట్‌ఫ్లిక్స్‌లో సిరీస్ కోసం చెప్పానన్నారు. కానీ సరిగ్గా అప్పుడే సంగీత్ ఈ స్క్రిప్ట్ విని.. చాలా నచ్చిందని చెప్పడంతో దీన్ని తెరపైకి తీసుకురావాలన్న ఆలోచన చేశామన్నారు. నిహారిక సైతం కేవలం 20 నిమిషాల స్క్రిప్ట్ వినడంతోనే ఓకే చేశారన్నారు. ఈ సినిమా విజువల్‌గా.. సౌండింగ్ పరంగా అందర్నీ ఆకట్టుకుంటుందన్నారు. ఈ చిత్ర సెకండాఫ్‌లో వీఎఫ్‌ఎక్స్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఉండటంతో తొలుత తాము సెకండాఫ్‌ను షూట్ చేశామన్నారు. ఒకవైపు వీఎఫ్‌ఎక్స్ పనులు జరుగుతుండగానే ప్రథమార్ధాన్ని చిత్రీకరించినట్టుగా తెలిపారు. అందుకే ఈ చిత్ర విషయంలో తమకు సమయం కలిసి వచ్చిందన్నారు.
వెబ్‌సిరీస్‌కైనా.. సినిమాకైనా సవాళ్లనేవి ఒకేలా ఉంటాయని మానస శర్మ తెలిపారు. రెండింటి మేకింగ్ ఒకటేనని.. కానీ, రచనా పరంగా తేడాలుంటాయని పేర్కొంటారు. ఈ చిత్రం నిహారికకు నచ్చాలని మరింత బాధ్యతగా పని చేసినట్టుగా తెలిపారు. ఇందులో నయన్ సారిక పాత్రని ప్రేక్షకులంతా చాలా ఇష్టపడతారని.. ఆమె చెప్పింది చెప్పినట్టుగా చేసే నటి అని మానస శర్మ పేర్కొన్నారు. ఈ చిత్ర కథ ఏంటన్నది తానిప్పుడే చెప్పలేనని.. త్వరలో ట్రైలర్ వస్తుందని.. దానిని చూశాక అందరికీ ఓ స్పష్టత వస్తుందన్నారు. ఇక మానస శర్మ పర్సనల్ విషయానికి వస్తే ఆమెది శ్రీకాకుళం. తొలుత యూట్యూబ్‌లో ‘మ్యాడ్ హౌస్’ చేసిన మీదట... ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’కి క్రియేటర్, రైటర్‌గా మానస శర్మ పని చేశారు. ఆ వెంటనే ‘బెంచ్ లైఫ్’ సిరీస్ చేశారు. ఇక ప్రస్తుతం తన నాలుగో ప్రాజెక్ట్‌తో దర్శకురాలిగా తెరపైకి వస్తున్నారు.
ప్రజావాణి చీదిరాల