Entertainment

Pawan Kalyan OG: పవర్‌స్టార్ కోసం ఏపీ డిప్యూటీ సీఎం రంగంలోకి దిగారా? రీల్, రియల్ వేర్వేరా?

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. ఈ రెండు విషయాల్లో పవన్ డిఫరెంటుగా ప్రవర్తిస్తారా? దేనికి చేసే న్యాయం దానికి చేస్తారా? అదెలా సాధ్యం

Pawan Kalyan OG: పవర్‌స్టార్ కోసం ఏపీ డిప్యూటీ సీఎం రంగంలోకి దిగారా? రీల్, రియల్ వేర్వేరా?

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. ఈ రెండు విషయాల్లో పవన్ డిఫరెంటుగా ప్రవర్తిస్తారా? దేనికి చేసే న్యాయం దానికి చేస్తారా? అదెలా సాధ్యం ఒక దానికి న్యాయం చేసే క్రమంలో మరొక ధర్మాన్ని విస్మరించాల్సి వచ్చినా పర్వాలేదా? అభిమానులు, కార్యకర్తలు బాగు కోరుకునే పవన్.. సినిమా నిర్మాత విషయానికి వచ్చేసరికి అది మరిచిపోతారా? ఎన్నో సమాధానం లేని ప్రశ్నలు...

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Powerstar Pawan Kalyan) నటించిన చిత్రం ‘ఓజీ’ (OG) మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా టికెట్లు (OG Movie Tickets) హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. అయితే ఏపీలో ఈ సినిమా విడుదల చేస్తున్న తీరే విమర్శలకు దారి తీస్తోంది. పవర్‌స్టార్ సినిమా విడుదల కోసం.. డిప్యూటీ సీఎం పవన్ (AP Deputy CM Pawan Kalyan) తన పవర్ వినియోగించారా? అనేది పెద్ద ప్రశ్న. దీనికి కారణం సినిమా టికెట్ రేటు. ఒక్కో టికెట్ వెయ్యి రూపాయలా? ఏమిటిది.. ఇంత దారుణమా? డిప్యూటీ సీఎం (AP Deputy CM)గా ప్రజలకు పవన్ ఎంతో అందుబాటులో ఉంటూ వస్తున్నారు. ఎవరికి ఏ సాయం కావల్సి వచ్చినా తక్షణమే చేస్తున్నారు. తన కాన్వాయ్ వెళుతుండగా.. ఎవరైనా కనిపించినా కూడా వారి కోసం వెహికిల్ ఆపి మరీ వారి వద్దకు వెళ్లి సమస్యలు కనుక్కుని పరిష్కారానికి కృషి చేస్తున్నారు. జన క్షేమమే తన సంకల్పంగా ముందుకు సాగుతున్నారు.

పిచ్చి అభిమానులకా మీరు టికెట్ ధరను పెంచేది?

ఇన్ని చేస్తున్న పవన్ కల్యాణ్ పవర్‌స్టార్ సినిమా విడుదల సమయం వచ్చేసరికి టికెట్ ధరను కొన్ని రెట్లు పెంచేస్తారా? సామాన్యుడు తన కుటుంబంతో సినిమాకు వెళ్లాలంటేనే భయపడే రోజుల్లో ఒక్కో టికెట్ రూ.1000 అంటే ఎలా? పవన్‌కు యూత్‌లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమాను తొలిరోజు చూడాలని తహతహలాడుతుంటారు. దాని కోసం ఏదైనా చేయడానికి వెనుకాడరు. అంతటి పిచ్చి అభిమానుల (Pawan Kalyan Fans)కా మీరు టికెట్ రూ.1000కి అమ్మేదని విపక్షాలు ప్రశ్నిస్తున్నారు. దీనికోసం మీ అధికారాన్ని వినియోగిస్తారా? అని ప్రశ్నిస్తున్నాయి. పెద్ద సినిమా విడుదలైనప్పుడు టికెట్ ధర పెంచడం సర్వసాధారణమే కానీ ‘బాహుబలి’ (Bahubali) వంటి వందల కోట్ల రూపాయలతో బడ్జెట్‌తో రూపొందిన చిత్రానికి కూడా టికెట్ ధరలు ఇంత పెట్టలేదే.. మరి ‘ఓజీ’కి ఎందుకు? అని విపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు.

భారీ బడ్జెట్ కాదే.. ఎందుకు పెంచారు?

భారీ బడ్జెట్ చిత్రానికైనా టికెట్ ధర పెంచడానికి ఓ కారణం ఉంటుంది. అదేంటంటే.. సినిమా పోతే కొంతమేర ఇబ్బంది లేకుండా ముందుగా రెండు, మూడు రోజుల పాటు అన్ని షోలకు టికెట్ ధరలు (Ticket Prices) పెంచుతారు.. బెనిఫిట్ షోలు (Benifit shows) వేస్తారు. ఆ మూడు రోజుల్లో దాదాపుగా మేకర్స్‌కు నష్టాలు రాకుండా చూసుకుంటారు. మరి ఈ సినిమా అంత భారీ బడ్జెట్ కాదు.. మరి టికెట్ ధరను ఎందుకు పెంచినట్టు? సినిమా పోతుందన్న భయమా.. మరొకటా? అని సామాన్య ప్రజానీకం సైతం ప్రశ్నిస్తున్నారు. నిర్మాతలను బాగు చేసేందుకు మీ కోసం ఏమైనా చేసే అభిమానులను ఇబ్బంది పెడితే ఎలాగని సోషల్ మీడియా (Social Media)లోనూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. పవర్ స్టార్ సినిమా అంటే యూత్ తమ తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టైనా డబ్బు తీసుకొచ్చి టికెట్‌కు పెట్టేస్తారు. ఒక చిన్న కుటుంబానికి రూ.1000 అంటే చాలా పెద్ద మొత్తం.. కుటుంబ సభ్యుని కొన్ని రోజుల శ్రమ. దానిని దోచేస్తారా? ఎంత దారుణమని నెటిజన్లు మండిపడుతున్నారు. రియల్ లైఫ్‌లో ఉన్నట్టే రీల్ లైఫ్‌లోనూ ఉండాలని ఏపీ ప్రజలు పవన్‌ను కోరుతున్నారు.

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
September 22, 2025 9:35 AM