Entertainment

Dulquer Salmaan: దుల్కర్, పృథ్వీరాజ్ స్మగ్లింగ్ కార్లు కొనుగోలు చేశారా?

మలయాళ నటులు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, దుల్కర్‌ సల్మాన్‌లు స్మగ్లింగ్ ద్వారా దేశంలోకి ఎంటరైన లగ్జరీ కార్లను కొనుగోలు చేశారా? అసలు దీనిని కేవలం ఆరోపణలుగానే కొట్టిపడేయాలా?

Dulquer Salmaan: దుల్కర్, పృథ్వీరాజ్ స్మగ్లింగ్ కార్లు కొనుగోలు చేశారా?

మలయాళ నటులు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ (Prithviraj Sukumaran), దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salmaan)లు స్మగ్లింగ్ ద్వారా దేశంలోకి ఎంటరైన లగ్జరీ కార్ల (Luxury cars)ను కొనుగోలు చేశారా? అసలు దీనిని కేవలం ఆరోపణలుగానే కొట్టిపడేయాలా? లేదంటే నిప్పులేనిదే పొగరాదనుకోవాలా? ఇక పొగ వస్తుందో లేదో కానీ కస్టమ్స్ అధికారులు అయితే వచ్చేశారు. ఇవాళ (మంగళవారం) కస్టమ్స్ అధికారులు దుల్కర్, పృథ్వీరాజ్ నివాసాల్లో సోదాలు నిర్వహించారు. వీరిద్దరిపై లగ్జరీ కార్ల స్మగ్లింగ్‌ (Smuggling) ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే కస్టమ్స్ అధికారులు (Customs officers) దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం కస్టమ్స్ అధికారులు ‘ఆపరేషన్‌ నమకూర్‌’ (Operation Namakur) పేరుతో దేశవ్యాప్తంగా పలువురు నివాసాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు.

‘ఆపరేషన్ నమకూర్‌ైలో భాగంగానే పృథ్వీరాజ్ సుకుమారన్ ఇళ్లతో పాటు పనంపిల్లి నగర్‌లోని దుల్కర్ నివాసంలోనూ సోదాలు నిర్వహించారు. వీరివురి ఇళ్లలోనూ నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి విలాసవంతమైన వాహనాలను అధికారులు గుర్తించలేదని సమాచారం. ఇదే విషయమై కేరళ (Kerala) వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఈ సోదాలు జరిగాయి. భూటాన్ ఆర్మీ (Bhutan Army) తన వాహన శ్రేణిలోని కొన్ని ఖరీదైన వాహనాలను ఉపసంహరించుకోవడంతో కొందరు ఏజెంట్లు వాటిని వేలంలో అతి తక్కువ ధరకు దక్కించుకున్నారని ఇంటెలిజెన్స్ వర్గాల (Intelligence sources) నివేదికలు చెబుతున్నాయి. అయితే సదరు ఏజెంట్లు వాళ్లు కొనుగోలు చేసిన ఖరీదైన వాహనాలకు ఎలాంటి కస్టమ్స్ డ్యూటీ చెల్లించకుండానే ఇండియాకు స్మగ్లింగ్ చేశారని ఇంటెలిజెన్స్‌కు సమాచారం అందింది.

అత్యంత ఖరీదైన వాహనాలను హిమాచల్‌ ప్రదేశ్ (Himachalpradesh) మీదుగా కొందరి నివాసాలకు తరలించినట్టుగా సమాచారం. అలాంటి విశ్వసనీయ కొనుగోలుదారుల్లో సెలబ్రిటీల (Celebrities)తో పాటు వ్యాపారవేత్తలు (Businessmen) ఉన్నారని ఇంటెలిజెన్స్‌కు సమాచారం అందింది. ముఖ్యంగా ఇండియన్‌-భూటాన్‌ ట్రేడ్‌ నిబంధనల్లో ఉన్న లొసుగులను ఆధారంగానే వాహనాలన్నింటినీ భారత్‌కు ఆయా ఏజెంట్లు తరలించారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఒకవైపు కొందరు సెలబ్రిటీలు, వ్యాపారవేత్తల నివాసాల్లో సోదాలు నిర్వహిస్తూనే మరోవైపు అన్ని వాహనాలకు సంబంధించిన రసీదులు, ఇతర ఆధారాలను కస్టమ్స్‌ అధికారులు పరిశీలిస్తున్నారు.

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
September 23, 2025 9:24 AM