Samantha: డేటింగ్ వార్తలు నిజమేనా? మరింత బలం చేకూర్చేలా ఫోటోలు..
రాజ్ నిడుమోరు కుటుంంతో కలిసి సామ్ దీపావళి సెలబ్రేషన్స్ (Samantha Diwali Celebrations) చేసుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా (Social Medi)లో సమంతే షేర్ చేసింది.

స్టార్ హీరోయిన్ సమంత (Samantha) తనపై వస్తున్న రూమర్స్‌కు చెక్ పెట్టేలా కనిపించడం లేదు సరికదా.. ఇంకాస్త బలాన్నిస్తోంది. బాలీవుడ్ దర్శకుడు (Bollywood Director) రాజ్ నిడిమోరు (Raj Nidimoru)తో డేటింగ్‌లో ఉన్నట్లు కొంతకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దీపావళి (Diwali) సందర్భంగా ఈ వార్తలకు బలాన్నిచ్చేలా కొన్ని ఫోటోలను విడుదల చేశారు. రాజ్ నిడుమోరు కుటుంంతో కలిసి సామ్ దీపావళి సెలబ్రేషన్స్ (Samantha Diwali Celebrations) చేసుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా (Social Medi)లో సమంతే షేర్ చేసింది. ఆ ఫోటోలకు సామ్ ‘నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ అని క్యాప్షన్ పెట్టారు. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు వీరిద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
టపాసులు కాలుస్తూ మంచి సందడిగా సామ్ గడిపినట్టుగా సామ్ షేర్ చేసిన ఫోటోలను బట్టి తెలుస్తోంది. తరచూ వీరిద్దరూ కలిసి కనిపిస్తున్నారు. ప్రస్తుతం సామ్ షేర్ చేసిన ఫోటోలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. రాజ్-డీకే (Raj-DK) సంయుక్తంగా తెరకెక్కించిన సమంత రెండు వెబ్ సిరీస్‌లు ‘ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2’ (Family Man 2), ‘సిటడెల్: హనీ బన్నీ’ (Honey Bunny)లో నటించారు. ఆ సమయంలోనే రాజ్‌తో పరిచయం కాస్తా స్నేహంగా మారింది. ఆ తరువాతి నుంచి వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ వాటిపై వీరిద్దరూ స్పందించింది కూడా లేదు. అలాగని ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నది లేదు. ప్రస్తుతం ఆమె ‘రక్త్ బ్రహ్మాండ్’ (Rakth Brahmand)లో నటిస్తోంది. ఇక త్వరలోనే సమంత ‘మా ఇంటి బంగారం’ (Maa Inti Bangaram) చిత్రం నందినీ రెడ్డి (Director Nandini Reddy) దర్శకత్వంలో ప్రారంభం కానుందని తెలుస్తోంది.