Dandora: ‘దండోరా’ మోగించేది అప్పుడేనట..
అగ్ర వర్ణాలకు చెందిన అమ్మాయిల ప్రేమించి పెళ్లి చేసుకున్నా, అగ్ర వర్ణాలకు ఎదురు తిరిగినా దౌర్జన్యకాండలు జరుగుతనే ఉన్నాయి. దీనినే కథాంశంగా చేసుకుని ఈ చిత్రం రూపొందుతోంది.
‘దండోరా’ (Dandora) చిత్రం ఒకప్పుడు వచ్చి మంచి సక్సెస్ సాధించిది. ఇప్పుడు అదే టైటిల్‌లో మురళీకాంత్ (Muralikanth) దర్శకత్వంలో సినిమా రూపొందుతోంది. నేషనల్ అవార్డ్ గెలుచుకున్న చిత్రం ‘కలర్ ఫోటో’ (Color Photo)..బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ (Loukya Entertainments) అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానేని (Ravindra Benarji Muppaneni) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ తాజాగా అనౌన్స్ చేశారు. క్రిస్మస్ (Cristmas) కానుకగా ఈ చిత్రం డిసెంబర్ 25న విడుదల కానుంది. దీనికి సంబంధించి విడుదలైన పోస్టర్ చాలా ఇన్నోవేటివ్‌గా ఉంది. ఒక ఖాళీ ప్రదేశంలో తవ్విన గొయ్యి.. దానిలో ఈ ఏడదికి డ్రామటిక్‌గా ముగిస్తున్నామనే క్యాప్షన్‌తో రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు.
ఇప్పటికే ఈ చిత్రంపై మంచి అంచనాలున్నాయి. సామాజిక స్పృహను కలిగించే అంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటికీ సమాజంలో కులం, మతం, పేద, ధనిక వంటి భావనలైతే పోలేదు. అగ్ర వర్ణాలకు చెందిన అమ్మాయిల ప్రేమించి పెళ్లి చేసుకున్నా, అగ్ర వర్ణాలకు ఎదురు తిరిగినా దౌర్జన్యకాండలు జరుగుతనే ఉన్నాయి. దీనినే కథాంశంగా చేసుకుని ఈ చిత్రం రూపొందుతోంది. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. మన పురాతన ఆచారాలు, సంప్రదాయాలను అద్దం పడుతూనే.. వ్యంగ్యం, చక్కటి హాస్యం, హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాల కలయికగా ఈ సినిమాను ఆవిష్కరిస్తున్నారు. ఈ చిత్రంలో విలక్షణ నటుడు శివాజీ (Shivaji) ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. ముఖ్య పాత్రల్లో నవదీప్ (Navadeep), నందు (Nandu), బిందు మాధవి (Bindu Madhavi), రవి కృష్ణ (Ravi Krishna) తదితరులు నటస్తున్నారు
ప్రజావాణి చీదిరాల