Director Maruthi: కాలర్‌పై కామెంట్స్.. ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు క్షమాపణ చెప్పిన మారుతి
ప్రతి ఒక్క మాటను పట్టి చూసుకుని మాట్లాడాలంటే సాధ్యం కాదు. అలా చూసుకుంటే ప్రతి మాట ఎక్కడో ఒకచోట.. ఎవరో ఒకరికి కనెక్ట్ అవుతూనే ఉంటుంది. అలాగని మాట్లాడటమే మానేస్తామా? ముఖ్యంగా స్టార్ హీరోల ఫ్యాన్స్ ప్రతి విషయంలోనూ చేసే రాద్ధాంతం అంతా ఇంతా కాదు..
ప్రతి ఒక్క మాటను పట్టి చూసుకుని మాట్లాడాలంటే సాధ్యం కాదు. అలా చూసుకుంటే ప్రతి మాట ఎక్కడో ఒకచోట.. ఎవరో ఒకరికి కనెక్ట్ అవుతూనే ఉంటుంది. అలాగని మాట్లాడటమే మానేస్తామా? ముఖ్యంగా స్టార్ హీరోల ఫ్యాన్స్ ప్రతి విషయంలోనూ చేసే రాద్ధాంతం అంతా ఇంతా కాదు.. ప్రతిదీ తమ హీరోకి అన్వయించుకుని రచ్చ చేస్తుంటారు. తాజాగా ‘రాజాసాబ్ (Rajasaab)’ ఈవెంట్‌లో డైరెక్టర్ మారుతి (Director Maruthi) మాటలను యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు అన్వయించి వారు చేసిన రాద్దాంతం అంతా ఇంతా కాదు.. ఇది మరింత ముదరకముందే తేరుకున్న మారుతి.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ (NTR Fans)కి క్షమాపణ చెప్పారు.
అసలు ‘ది రాజాసాబ్’ (The Rajasaab( ఈవెంట్‌లో మారుతి మాట్లాడుతూ.. తాను కాలర్ ఎగరేసుకోమని అయితే చెప్పనని.. దానికి కారణం.. ప్రభాస్ (Prabhas) కటౌట్‌కు అది చాలా చిన్న మాట’ అని పేర్కొన్నారు. కాలర్ అనే పదం వచ్చేసరికి అది ఎన్టీఆర్ (NTR)ను ఉద్దేశించే అన్నాడంటూ ఫ్యాన్స్ ఫైర్ అయిపోయారు. ఇటీవలి కాలంలో ఎన్టీఆర్ తరచుగా ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునే సినిమా ఇస్తానంటూ చెప్పుకొస్తున్నారు. దీంతో మారుతి తమ హీరో గురించే అన్నారంటూ పెద్ద ఎత్తున రచ్చ ప్రారంభించారు. సోషల్ మీడియా (Social Media) వేదికిగా ఫ్యాన్స్ పెద్ద ఎత్తున మారుతిపై విమర్శలు గుప్పించారు. పరిస్థితిని గమనించిన మారుతి తాజాగా ట్విటర్ వేదికగా తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు.
తన చేసిన వ్యాఖ్యలపై ప్రతి అభిమానికి హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నానని మారుతి పేర్కొన్నారు. తాను ఎవ్వరినీ బాధ పెట్టడమో లేదంటే అగౌరవంగా మాట్లాడటమో తన ఉద్దేశం కాదని.. కొన్నిసార్లు మనం మాట్లాడుతున్న సమయంలో వచ్చిన మాటలు ఎవరినీ ఉద్దేశించినవి కావని.. ఆ వ్యాఖ్యలను తపపుగా లేదంటే పోలికగా భావించినందుకు తాను చింతిస్తున్నానని వెల్లడించారు. ఎన్టీఆర్, ఆయన అభిమానుల పట్ల తనకు అపారమైన గౌరవం ఉందన్నారు. సినిమా పట్ల.. అలాగే మీ హీరో పట్ల మీరు చూపిస్తున్న ప్రేమకు తాను ఎప్పుడూ విలువిస్తానని అన్నారు. తన మాటలను వేరేలా అర్థం చేసుకోవద్దని.. అలాగే పోలికగా కూడా చూడవద్దని అభ్యర్థించారు.
మనస్ఫూర్తిగా ఈ మాటలు చెబుతున్నానని.. తన వ్యాఖ్యల వెనుక ఉన్న ఉద్దేశాన్ని గ్రహించాలని మారుతి కోరారు. వాస్తవానికి ఎన్టీఆర్, మారుతి మధ్య మంచి సాన్నిహిత్యమే ఉంది. అసలు మారుతికి ఎన్టీఆర్‌పై కామెంట్స్ చేసేంత నిస్సందేహంగా లేదు. అనుకోకుండా మారుతి నోటివెంట వచ్చిన మాటలను తీసుకుని తమ హీరోకి అన్వయించుకుని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనవసర రాద్దాంతం చే స్తున్నారు. ఏదిఏమైనా వివాదం మరింత ముదరకముందే తేరుకుని బహిరంగ క్షమాపణ చెప్పిన మారుతికి హ్యాట్స్‌ఫ్ చెప్పాల్సిందే. మారుతి ఇచ్చిన క్లారిటీతో కాలర్ వివాదానికి తెరపడినట్టుగానే భావించాలి.
ప్రజావాణి చీదిరాల