Supriya Yarlagadda: ‘డెకాయిట్’కు క్లైమాక్సే అందం..
డెకాయిట్ కు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా ఆడియన్స్ నుంచి వచ్చే రెస్పాన్స్ మనసుకు చాలా ఆనందాన్ని ఇచ్చిందని సుప్రియ తెలిపారు.
హిట్ మిషన్ అడివి శేష్, మృణాల్ ఠాకూర్ లేటెస్ట్ ఆడియన్స్ బ్లాక్ బస్టర్ 'డెకాయిట్’. షానియల్ డియో దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఈ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ నిర్మించగా, సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రం ఏప్రిల్ 10న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం మంచి సక్సెస్ టాక్‌తో రన్ అవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత సుప్రియ యార్లగడ్డ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
డెకాయిట్ కు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా ఆడియన్స్ నుంచి వచ్చే రెస్పాన్స్ మనసుకు చాలా ఆనందాన్ని ఇచ్చిందని సుప్రియ తెలిపారు. డెకాయిట్ ని రెండు భాషల్లో తీయడంపై మాట్లాడుతూ.. అన్నీ బడ్జెట్ పరంగా అలోచేస్తే సినిమాకి, కథకి న్యాయం చేయలేమని.. సినిమా అంటే ఒక మ్యాజిక్‌లా ఉండాలన్నారు. హిందీలో సైతం ‘డెకాయిట్’కు రెస్పాన్స్ చాలా బాగుందని.. తెలుగులో తీసిన సినిమా అక్కడికి చేరడం చాలా ఆనందంగా ఉందన్నారు. డెకాయిట్‌ని తమిళ్, మలయాళం, కన్నడలో కూడా డబ్ చేశామని... కాకపోతే ఆ డబ్ ఓటీటీకి పరిమితమని తెలిపారు. పవన్ సింగ్, జోనితా లాంటి స్టార్స్ వుండటం వలన నార్త్ లో చాలా హెల్ప్ అయ్యిందన్నారు. వాస్తవానికి పవన్ సింగ్‌ని ఒక పాట పాడమని సంప్రదించామని.. ఆయనే కనిపిస్తానని అన్నారని సుప్రియ తెలిపారు.
భోజ్ పురి వారికి తెలుగు సినిమాలు అంటే చాలా ఇష్టమని... మాస్ సినిమా అక్కడ చాలా పాపులర్ అని సుప్రియ తెలిపారు. పవన్ సింగ్ సైతం నాగ్ సర్ ని కలవాలని అడిగారన్నారు. డెకాయిట్ కోసం చాలా మంది చాలా ప్రేమని చూపించారని.. జోనితా పాట పాడటంతో పాటు తెరపై కనిపించడం ప్లస్ అయ్యిందన్నారు. ‘డెకాయిట్’ను దాదాపు అందరూ కొత్తవాళ్ళతో.. యంగ్ టీంతో చేశామని తెలిపారు. సినిమాని డిఫరెంట్ లోకేషన్స్‌లో షూట్ చేశామని... డ్యాం దగ్గర షూట్ చేసినప్పుడు పర్మిషన్ తీసుకోవడం అంత ఈజీ కాదన్నారు. దాదాపు రెండు వందల మందిని ఒక్క చోటికి చేర్చి షూట్ చేయాల్సి వచ్చేదని.. అలా షూటింగ్‌లో చాలా ఛాలెంజెస్ ఫేస్ చేసినట్టుగా సుప్రియ తెలిపారు. క్లైమాక్స్ సన్నివేశంపై ఆమె మాట్లాడుతూ.. మంచి సినిమాకి ఎప్పుడూ రిస్క్ ఉంటుందని.. ఈ సినిమాలో వరకూ క్లైమాక్సే అందమన్నారు. తనకు డ్రామా, ప్రేమకథలు ఇష్టమని.. కాకపోతే ఇప్పుడు తెలుగులో అవి మిస్ అవుతున్నాయన్నారు.
హరి క్యారెక్టర్‌లో శేష్ గారు అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారని.. శేష్, మృణాల్ క్యారెక్టర్ ఆడియన్స్‌కు ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యాయని సుప్రియ తెలిపారు. తమ సినిమాకు యూఎస్ రెస్పాన్స్ కూడా అద్భుతంగా ఉందని.. వీకెండ్‌కు వన్ మిలియన్ దాటుతుందన్నారు. సినిమా అంటే తనకు ప్రేమ అని.. సినిమాతో ఆడియన్స్‌కు సర్‌ప్రైజ్‌లు ఇస్తే ఇష్టమన్నారు. అనురాగ్ కశ్యప్ గారు ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పగానే చేస్తా అన్నారని తెలిపారు. ఇక ముందు తన నెక్ట్స్ సినిమాకు సంబంధించిన కథలు వినడం మొదలు పెడతానని సుప్రియ అన్నారు.