Entertainment

Chiranjeevi: రామ్ చరణ్ ఆ సినిమా చూస్తే కానీ అన్నం తినేవాడు కాదు..

చిన్నప్పుడు చెర్రీ (Ramcharan).. వాళ్ల అమ్మ ఈ సినిమా క్యాసెట్ పెడితే గానీ భోజనం చేసేవాడు కాదని చిరు (Chiranjeevi) వెల్లడించారు. అంతగా చరణ్‌కు ఇష్టమైన సినిమా ఇదని చిరు తెలిపారు.

Chiranjeevi: రామ్ చరణ్ ఆ సినిమా చూస్తే కానీ అన్నం తినేవాడు కాదు..

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Globle Star Ram Charan) గురించి మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. చిరు నటించిన ‘కొదమసింహం’ (Kodamasimham) మూవీ ఈ నెల 21న రీరిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే ఈ చిత్రానికి సంబంధించి మేకర్స్ ప్రెస్‌మీట్ నిర్వహించారు. దీనిలో భాగంగా చిరు స్పెషల్ వీడియో ద్వారా ఈ సినిమాతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ క్రమంలోనే తనతో పాటు రామ్ చరణ్‌ (Ramcharan)కు సంబంధించి కూడా ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ చిత్రం చూడనిదే చిన్నప్పుడు రామ్ చరణ్ అన్నం కూడా తినేవాడు కాదని తెలిపారు. ఈ చిత్రంలో తన స్టిల్ చాలా పాపులర్ అని.. స్టిల్ కూడా చాలా పాపులర్ అని.. అదే తన ఫేవరెట్ ఫోటో అన్నారు. ఆ సమయంలో తనకు ఆ స్టిల్ నచ్చడంతో నిర్మాతలు దానిని ఫ్రేమ్ చేసి తనకు గిఫ్ట్‌గా ఇచ్చారని తెలిపారు.

రామ్ చరణ్‌కు ఎక్కువ ఇష్టం..

తనకు ‘కొదమసింహం’ (Kodamasimham Movie) చాలా ఫేవరేట్ మూవీ (Chiru Favorite movie) అని.. తనకంటే కూడా రామ్ చరణ్‌ (Ram Charan)కు ఈ సినిమా ఇంకా ఎక్కువ ఇష్టమని మెగాస్టార్ తెలిపారు. చిన్నప్పుడు చెర్రీ.. వాళ్ల అమ్మ ఈ సినిమా క్యాసెట్ పెడితే గానీ భోజనం చేసేవాడు కాదని చిరు వెల్లడించారు. అంతగా చరణ్‌కు ఇష్టమైన సినిమా ఇదని చిరు తెలిపారు. చెర్రీ కూడా ఆ మధ్య ఓ ప్రెస్‌మీట్‌లో ‘కొదమసింహం’ మూవీ చూసిన తర్వాత తనకు హార్స్ రైడింగ్‌పై ఇంట్రస్ట్ ఏర్పడిందని వెల్లడించాడు. ‘కొదమసింహం’లోని చిరును ఇసుకలో విలన్స్ కప్పెడితే గుర్రం ఆయనను లాగుతుంది. రామ్ చరణ్ ‘మగధీర’ (Magadheera) చిత్రంలో ఈ సీన్‌ను రీక్రియేషన్ చేసినట్టు అప్పట్లో టాక్ నడిచింది.

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
November 19, 2025 4:59 PM