Chiranjeevi: చిరు రూటే సెపరేటు..
ఎవరైనా అభిమాని హీరోని వెదుక్కుంటూ వెళితే వాళ్లేం చేస్తారు? మహా అయితే ఒక ఫోటో ఇస్తారు. లేదంటే అప్యాయంగా నాలుగు మాటలు మాట్లాడి పంపించేస్తారు. కానీ మెగాస్టార్ చిరంజీవి రూటే సెపరేటు.

ఎవరైనా అభిమాని హీరోని వెదుక్కుంటూ వెళితే వాళ్లేం చేస్తారు? మహా అయితే ఒక ఫోటో ఇస్తారు. లేదంటే అప్యాయంగా నాలుగు మాటలు మాట్లాడి పంపించేస్తారు. కానీ మెగాస్టార్ చిరంజీవి రూటే సెపరేటు. అలా వీలైతే ఒక ఫోటో.. కుదిరితే నాలుగు మాట్లాడి పంపించలేదు. వచ్చిన అభిమానిని ఆప్యాయంగా పలకరించారు. ఆమె రాఖీ కట్టారు. ఆ తరువాత ఆమె సింగిల్ పేరెంట్ అని తెలిసి ఎవరూ ఊహించని సాయమే చేశారు.
మెగాస్టార్ చిరంజీవి (Megastar chiranjeevi) అభిమానుల (Chiru Fans)ను ఎంతలా దగ్గరకు తీస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్నో సందర్భాల్లో అది రుజువైంది. తాజాగా మరోసారి ‘దట్ ఈజ్ చిరు’ అనిపించారు. రాజేశ్వరి అనే మహిళకు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అంటే ఎంతో ఇష్టం. ఆమెది ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh)లోని ఆదోని. చిరు (Chiru)ని కలవాలనేది ఆమె కల. ఎప్పటి నుంచో ఆ కోరికను నెరవేర్చుకోవాలనే తపనతో ఉన్న రాజేశ్వరి తాజాగా తన కలను సాకారం చేసుకునే పనిలో పడింది. ఈ క్రమంలోనే ఆదోని నుంచి సైకిల్‌పై హైదరాబాద్ (Hyderabad)కు ప్రయాణం మొదలు పెట్టింది. అభిమాని పురుషుడు అయితే పర్వాలేదు కానీ ఒక మహిళ సైకిల్ ప్రయాణం అంటే సాధారణ విషయమా? ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయినా సరే.. రాజేశ్వరి ఏమాత్రం వెనుకడుగు వేయకుండా తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది. మానసిక, శారీరక సమస్యలను అధిగమించి మరీ చిరు నివాసాన్ని చేరుకుంది.
పిల్లల చదువుకు సాయం..
రాజేశ్వరి గురించి తెలుసుకున్న చిరు (Chiru).. ఆమెను చక్కగా ఆహ్వానించి ప్రేమగా పలకరించారు. తన వద్దకు వచ్చేందుకు ఆమె చేసిన సాహస ప్రయాణాన్ని తెలుసుకుని చలించిపోయారు. అనంతరం చిరుకి రాజేశ్వరి రాఖీ (Rakhi) కట్టింది. ఆమె చిరు ఆశీస్సులు అందించి ఒక చీరను బహూకరించారు. అంతేకాకుండా ఆమె పిల్లలకు సైతం బహుమతులు ఇచ్చారు. రాజేశ్వరి సింగిల్ పేరెంట్ (Single Parent) అని తెలుసుకున్న చిరు.. ఆమె పిల్లల విద్యా బాధ్యతలు ఆయన స్వీకరించారు. పిల్లలిద్దరూ ఎంతవరకూ చదువుకోగలిగితే అంత వరకూ చదివించే బాధ్యత తనదని చిరు వెల్లడించారు. ఇంతకు మించి ఒక తల్లికి ఏం కావాలి. రాఖీ కట్టినందుకు పిల్లలు చదువుకున్నంత కాలం సాయం అందిస్తామనడానికి మించినది ఏముంది? విద్య ఈ రోజుల్లో తల్లిదండ్రులకు చాలా భారమైపోయింది. పైగా రాజేశ్వరి సింగిల్ పేరెంట్. ఇద్దరు పిల్లలను చదివించడమంటే మాటలు కాదు. చిరు ఆమెకు కొండంత భరోసా ఇచ్చినట్టే. ఆమె భుజస్కందాల నుంచి పెను భారాన్ని దింపినట్టే.. ‘మీకోసం ఇంత కష్టపడుతున్న అమ్మను మీరు చక్కగా చదివి ఉద్యోగాలు చేస్తే సుఖంగా చూసుకోవచ్చు’ అంటూ పిల్లలకు సైతం హితబోధ చేశారు. మొత్తానికి దట్ ఈజ్ చిరు (That Is Chiru) అనిపించుకున్నారు.
ప్రజావాణి చీదిరాల