Chiranjeevi: ఏంటి వెంకీ సంగతి.. ఇరగతీద్దాం సంక్రాంతీ..
మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కాంబో ఎలా ఉంటుందో చూడాలనుకున్న అభిమానుల కోరిక ఎట్టకేలకు నెరవేరింది. ఈ క్రమంలోనే ‘ఆర్ యూ రెడీ’ అంటూ ప్రేక్షకులను అలరించేందుకు చిరు, వెంకీ సిద్ధమయ్యారు.
మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh) కాంబో ఎలా ఉంటుందో చూడాలనుకున్న అభిమానుల కోరిక ఎట్టకేలకు నెరవేరింది. ఈ క్రమంలోనే ‘ఆర్ యూ రెడీ’ అంటూ ప్రేక్షకులను అలరించేందుకు చిరు (Chiru), వెంకీ (Venky) సిద్ధమయ్యారు. అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో చిరంజీవి (Chiranjeevi) హీరోగా నటించిన చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’ (Mana Shankaravaraprasad Garu). ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్‌ను చిత్ర యూనిట్ ప్రారంభించింది. ఈ చిత్రంలో వెంకటేశ్ అతిథి పాత్రలో సందడి చేయనున్నారు. నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది.
ఈ చిత్రం నుంచి చిరు, వెంకీ కాంబోలో రూపొందిన ‘ఆర్ యూ రెడీ’ సాంగ్ తాజాగా విడుదలైంది. ‘ఏంటి బాసూ సంగతీ.. అదిరిపోద్దీ సంక్రాంతీ.., ఏంటి వెంకీ సంగతీ.. ఇరగతీద్దాం సంక్రాంతీ..’ అంటూ ఈ సాంగ్ చాలా హుషారుగా కొనసాగింది. ఈ పాట కూడా ఈ చిత్రంలోని ఇతర పాటల మాదిరిగానే ఆకట్టుకోవడం ఖాయంగా తెలుస్తోంది. మొత్తానికి అనిల్ రావిపూడి అయితే తను తీస్తున్న చిత్రాల్లో ఒక సంక్రాంతి సాంగ్‌ను జత చేస్తున్నారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vastunnam)లో కూడా ఒక సంక్రాంతి సాంగ్ ఉంది. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న (Mana Shankaravaraprasad Garu Release) విడుదల కానుంది.
ప్రజావాణి చీదిరాల