Chiranjeevi: బాక్సాఫీస్‌ను రఫ్ఫాడిస్తున్న చిరు.. 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్..
మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్‌ను రఫ్ఫాడిస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతి బరిలో ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రంతో నిలిచారు. అనిల్ రావిపూడి దర్శకత్వలో వచ్చిన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కూడా పూర్తి చేసుకుంది.
మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్‌ను రఫ్ఫాడిస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతి బరిలో ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రంతో నిలిచారు. అనిల్ రావిపూడి దర్శకత్వలో వచ్చిన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కూడా పూర్తి చేసుకుంది. కేవలం ఆరు రోజుల్లోనే ఈ సినిమా ఈ ఘనతను సాధించింది. ప్రస్తుతం ఈ సినిమా వసూళ్లు చూసి ట్రేడ్ వర్గాలే అవాక్కవుతున్నాయి. ఈ సినిమా కేవలం 6 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.261 కోట్ల గ్రాస్ వసూలు చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీనికి కారణాలు లేకపోలేదు. సాధారణంగా భారీ బడ్జెట్ సినిమాలకు సేఫ్ జోన్‌లోకి వచ్చేందుకు కొంత సమయం పడుతుంది. కానీ ఈ సినిమా మాత్రం రికార్డ్ టైమ్‌లో సేఫ్ జోన్‌లోకి రావడం విశేషం.
వాస్తవానికి సంక్రాంతి పండుగకు ఐదు సినిమాలు విడుదలయ్యాయి. ‘రాజాసాబ్’ ముందుగా విడుదలైంది. తొలి షోతోనే డిజాస్టర్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఆ తరువాత ‘మన శంకరవరప్రసాద్ గారు’ విడుదలైంది. ఇది పర్వాలేదనిపించుకుంది. అనంతరం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ వచ్చింది. అది కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఇక ఆ తరువాత ‘అనగనగా ఒకరాజు’, ‘నారీ నారీ నడుమ మురారీ’. అయితే ఈ చిత్రాల్లో ‘నారీ నారీ నడుమ మురారీ’ టాక్ అయితే బాగుంది కానీ దానికి సరిపడా థియేటర్లు కరువయ్యాయి. ‘నారీ నారీ నడుమ మురారీ’ తరవాత ‘మన శంకరవరప్రసాద్ గారు’ ఉన్నా కూడా.. థియేటర్ల సమస్యతో వసూళ్ల పరంగా చిరంజీవి చిత్రమే ముందుంది.