Entertainment

Peddi: చంద్రునిలో ముక్క జారిందో లేదో కానీ.. ‘చికిరి చికిరి’ మాత్రం నెట్టింట సెన్సేషన్..

చంద్రునిలో ముక్క జారిందో లేదో కానీ.. ఈ చికిరి చికిరి మాత్రం నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. క్షణాల వ్యవధిలో వ్యూస్ లక్షల బాట పట్టాయి.. లైక్స్ లక్షను అందుకునేందుకు తహతహలాడుతున్నాయి.

Peddi: చంద్రునిలో ముక్క జారిందో లేదో కానీ.. ‘చికిరి చికిరి’ మాత్రం నెట్టింట సెన్సేషన్..

చంద్రునిలో ముక్క జారిందో లేదో కానీ.. ఈ చికిరి చికిరి ఫుల్ సాంగ్ తాజాగా విడుదలై నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. క్షణాల వ్యవధిలో వ్యూస్ లక్షల బాట పట్టాయి.. లైక్స్ లక్షను అందుకునేందుకు తహతహలాడుతున్నాయి. మొత్తానికి ఒకే ఒక్క సాంగ్‌తో ‘పెద్ది’ సోషల్ మీడియా (Social Media)ను పరుగులు తీయిస్తోంది. రామ్ చరణ్ (Ram Charan), జాన్వీ కపూర్ (Janhvi Kapoor) జంటగా నటించిన చిత్రమే ‘పెద్ది’ (Peddi). బుచ్చిబాబు సాన (Butchibabu Sana) ఈ చిత్రాన్ని చాలా శ్రద్ధగా సాన పడుతున్నట్టున్నారు. సినిమాపై అంచనాలను బీభత్సంగా పెంచేస్తున్నారు. ఇక తాజాగా ఈ చిత్రం నుంచి ‘చికిరి చికిరి’ సాంగ్ వచ్చేసింది.

ఇలా సాంగ్ రిలీజ్ (Chikiri Chikiri Song Released) అయ్యిందో లేదో కానీ నెట్టింట మాత్రం వ్యూస్ పేరిట పరుగుల వర్షం పారిస్తోంది. ఈ పాటకు స్పెషల్ అట్రాక్షన్ రామ్ చరణ్ డ్యాన్స్.. ఏఆర్ రెహమాన్ (AR Rahman) మ్యూజిక్.. జాన్వీ కపూర్ (Janhvi kapoor) గ్లామర్ అనే చెప్పాలి. అమ్మడు లంగా ఓణీలో కనిపిస్తున్నా కూడా అందాలను బాగానే ఆరబోసింది. పాటకు మరో ప్లస్ మోహిత్ చౌహాన్ గాత్రం. ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ఇంతకు మించి ఏం కావాలి? అందుకేనేమో ఈ పాట సోషల్ మీడియా (Social Media)ను ఒక ఊపు ఊపేస్తోంది. ‘చంద్రునిలో ముక్క.. జారిందే దీనక్క.. నా ఒళ్లంతా ఆడిందే తైతక్కా..’ అంటూ రామ్ చరణ్ డ్యాన్స్ (Ram Charan Dance) ఇరగదీశాడు.

పల్లెటూరి నేపథ్యంలో కథ సాగుతుందని ఇప్పటి వరకూ వచ్చిన అప్‌డేట్స్‌ను బట్టి తెలుస్తోంది. ఈ చిత్రంలో జాన్వీ (Janhvi).. అచ్చియమ్మ అనే పాత్రలో నటిస్తోంది. క్రికెట్ ప్లేయర్‌ (Cricket Player)గా రామ్ చరణ్ నటిస్తున్నాడు. మొత్తానికి రామ్ చరణ్ ‘రంగస్థలం’ (Rangastalam) మాదిరిగానే మరో ఊర మాస్ గెటప్‌లో మెప్పించేందుకు సిద్ధమవుతున్నాడు. వచ్చే ఏడాది మార్చి 27న ఈ చిత్రం విడుదల కానుంది. దాదాపుగా ఈ సమయంలో విడుదల కావాల్సిన పెద్ద సినిమాలన్నీ వాయిదా పడిపోవడంతో బాక్సాఫీస్‌ను ‘పెద్ది’ (Peddi) దున్నేయడం ఖాయంగా కనిపిస్తోంది.

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
November 7, 2025 6:22 AM