Entertainment

Peddi: ‘పెద్ది’ షూటింగ్‌లో చెర్రీకి గాయం.. సినిమా విడుదల వాయిదా పడుతుందా?

రామ్‌ చరణ్‌, బుచ్చిబాబు కాంబోలో రూపొందుతున్న చిత్రం ‘పెద్ది’ (Peddi). ఇప్పటికే చిత్ర షూటింగ్ పూర్తి కావాల్సి ఉంది. దీని కోసం చిత్ర యూనిట్ శరవేగంగా షూటింగ్ నిర్వహిస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్‌లో రామ్‌ చరణ్‌కు (Ram Charan) గాయమైనట్లు వార్తలు వచ్చాయి

Peddi: ‘పెద్ది’ షూటింగ్‌లో చెర్రీకి గాయం.. సినిమా విడుదల వాయిదా పడుతుందా?

రామ్‌ చరణ్‌, బుచ్చిబాబు కాంబోలో రూపొందుతున్న చిత్రం ‘పెద్ది’ (Peddi). ఈ సినిమా ఏప్రిల్‌ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే చిత్ర షూటింగ్ పూర్తి కావాల్సి ఉంది. దీని కోసం చిత్ర యూనిట్ శరవేగంగా షూటింగ్ నిర్వహిస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్‌లో రామ్‌ చరణ్‌కు (Ram Charan) గాయమైనట్లు వార్తలు వచ్చాయి. షూటింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఆయన కంటి దగ్గర దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. అయితే అది చిన్న గాయమేనని సినీ వర్గాలు చెబుతున్నాయి. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందంటున్నారు. దీంతో ఈ సినిమా షూటింగ్‌ కొన్ని రోజులు వాయిదా పడినట్లు ప్రచారం జరుగుతోంది.

చెర్రీ సినిమా షూటింగ్ కొద్ది రోజులు వాయిదా పడటంతో ఇది అనుకున్న సమయానికి విడుదలవుతుందా? లేదా? అనే సందేహాలు నెలకొన్నాయి. దీనిపై చిత్ర యూనిట్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ చిత్రంలో రామ్ చరణ్‌ సరసన జాన్వీకపూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఓ స్పెషల్ సాంగ్‌లో మృణాల్ ఠాకుర్ స్టెప్పులేయనుందని తెలుస్తోంది. అలాగే శివరాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు, బోమన్‌ ఇరానీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏఆర్‌ రెహమాన్‌ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు కోట్ల వ్యూస్‌తో సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అయ్యాయి. ఇక త్వరలో అంటే రామ్‌ చరణ్‌ పుట్టినరోజు సందర్భంగా టీజర్‌ను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

 

 

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
March 25, 2026 4:36 AM