CM Chandrababu: చంద్రబాబు ‘చాణక్య’ వ్యూహం.. ఈసారి లెక్క తప్పదు!
భారత రాజకీయ యవనికపై నాలుగు దశాబ్దాలకు పైగా తనదైన ముద్ర వేసిన అరుదైన సీనియర్ నాయకుల్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ముందుంటారు.
భారత రాజకీయ యవనికపై నాలుగు దశాబ్దాలకు పైగా తనదైన ముద్ర వేసిన అరుదైన సీనియర్ నాయకుల్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ముందుంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ విప్లవాన్ని తీసుకువచ్చినా, విభజిత ఏపీలో అమరావతి పునర్నిర్మాణానికి నడుం బిగించినా, జాతీయ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించినా ఆయన శైలి అసాధారణం. అయితే, ‘అద్భుతమైన పాలకుడు’గా పేరు తెచ్చుకున్నా, గుజరాత్‌లో బీజేపీ (BJP) లాగానో లేదా ఒడిశాలో నవీన్ పట్నాయక్ (Naveen Patnayak) లాగానో నిరంతరాయంగా అధికారంలో కొనసాగలేకపోవడం అనేది చంద్రబాబు (Chandrababu) కెరీర్‌కు ఇప్పటివరకూ ఉన్న ఒకే ఒక్క తీరని లోటు. ‘చేతిలో వెన్నముద్ద పెట్టుకుని నెయ్యి కోసం ఏడ్చినట్లు’.. విజన్ ఉన్నా, అధికారం నిలబెట్టుకోలేకపోవడం ఆయనను తరచుగా వెంటాడే సవాలుగా ఉండేది. కానీ, ఇప్పుడు ఆ లోటును పూడ్చుకుని, ఆంధ్రప్రదేశ్‌ను సుదీర్ఘకాలం అభివృద్ధి పథంలో ఉంచేందుకు ఆయన కొత్త వ్యూహానికి పదును పెడుతున్నారు.
పాలనపై పట్టున్నా.. పదే పదే సవాలే!
రాష్ట్రాభివృద్ధి, సంస్కరణల విషయంలో చంద్రబాబు ఎప్పుడూ ఇతరుల కంటే రెండు అడుగులు ముందే ఉంటారు. 74 ఏళ్ల వయసులోనూ 18 గంటలు పనిచేసే ఆయన నిబద్ధత చూసి, పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) సైతం ఆయన్ను తిరుగులేని శక్తిగా కొనియాడారు. అయితే, రాజకీయ చాణక్యు (Political Chanakya)డిగా పేరున్నప్పటికీ, అధికారం కోసం ఆయన వేసే కొన్ని ఎత్తుగడలు గతంలో బూమరాంగ్ అయ్యాయి. 2019లో కాంగ్రెస్‌తో చేతులు కలపడం ఆయనకు రాజకీయంగా పెద్ద దెబ్బ తగిలింది. అయితే, చంద్రబాబు ప్రత్యేకత ఏమిటంటే.. విమర్శలను పట్టించుకోకుండా, రాష్ట్ర ప్రయోజనాలు, పార్టీ మనుగడ కోసం 2024లో మళ్లీ ఎన్డీయే (NDA)తో జతకట్టారు. ప్రత్యర్థులు దీన్ని అవకాశవాదం అని విమర్శించినా, ఆయన దీన్ని రాజకీయ అవసరంగా సమర్థించుకుంటారు. ఈ వ్యూహాత్మక ఫ్లెక్సిబిలిటీనే ఆయన్ను రేసులో నిలబెడుతోంది.
గుజరాత్ మోడల్ వైపు, చూపు
తాజాగా, చంద్రబాబు ఆలోచనా విధానంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. కేవలం ఐదేళ్ల పాలనతో తను చేసిన అభివృద్ధి, నిర్మించిన వ్యవస్థలు (ముఖ్యంగా అమరావతి) ఎలా కుప్పకూలతాయో 2019-2024 మధ్య ప్రత్యక్షంగా చూశారు. అందుకే, రాష్ట్రం బాగుపడాలంటే, కేవలం ఐదేళ్లు కాదు, సుదీర్ఘకాలం ఒకే కూటమి అధికారంలో ఉండాలని ఆయన ఇప్పుడు బలంగా నమ్ముతున్నారు. గుజరాత్ (Gujarath)లో బీజేపీ దశాబ్దాల పాలన ద్వారానే పారిశ్రామిక ప్రగతి, మౌలిక సదుపాయాలు సాధ్యమయ్యాయని ఆయన పార్టీ సమావేశాల్లో పదేపదే ప్రస్తావిస్తున్నారు. చంద్రబాబు దృష్టి ఇప్పుడు కేవలం వర్తమానంపైనే లేదు.. అది 2029 ఎన్నికలపై గట్టిగా కేంద్రీకృతమై ఉంది. మిత్రపక్షాలైన జనసేన (Janasena), బీజేపీ (BJP)లతో సత్సంబంధాలను కొనసాగిస్తూ, ఓట్ల బదిలీని పదిలపరుచుకోవడం ద్వారా, ఈ కూటమిని వచ్చే 10-15 ఏళ్లు అధికారంలో ఉంచేలా ఒక పక్కా ప్రణాళికను రచిస్తున్నారు. గతంలో అభివృద్ధిపైనే దృష్టి పెట్టి దెబ్బతిన్న బాబు, ఈసారి సూపర్ సిక్స్ (Super Six) పథకాలతో సంక్షేమాన్ని కూడా సమతుల్యం చేసి, ప్రజల నాడి పట్టుకోవాలని చూస్తున్నారు.
తప్పులేదు కానీ..
కలలు కనడం గొప్పే, కానీ దాన్ని నిజం చేసే అధికారం లేకపోతే నిష్ప్రయోజనం.. ఈ సత్యాన్ని ఆలస్యంగా గుర్తించిన చంద్రబాబు (Chandrababu), ఇప్పుడు కేవలం అభివృద్ధి ప్రదాతగా కాకుండా, అధికారాన్ని సుస్థిరం చేసుకోగల యుగపురుషుడిగా స్థిరపడాలని తపిస్తున్నారు. అభివృద్ధి చేయడంలో సిద్ధహస్తుడైన చంద్రబాబు, ఈసారి సుదీర్ఘకాలం అధికారాన్ని నిలబెట్టుకోవడంలో సఫలమవుతారా? గుజరాత్ తరహాలో ఏపీలో టీడీపీ (TDP) కూటమిని ఒక శాశ్వత రాజకీయ శక్తిగా మార్చగలరా? అన్నది రాబోయే కాలమే నిర్ణయిస్తుంది. ఏదేమైనా, చంద్రబాబు (CM Chandrabau) వ్యూహంలో ఈసారి చక్రం తిప్పే పట్టుదల బలంగా కనిపిస్తోంది. ఏం జరుగుతుంతో చూడాలి మరి.
ప్రజావాణి చీదిరాల