Entertainment

Sandeep Reddy Vanga: ‘దిల్ దియా’ నుంచి చైతన్యరావు ఫస్ట్ లుక్.. చిత్రం చెప్పే కథేంటంటే..

వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో విల‌క్ష‌ణ న‌టుడిగా త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న చైత‌న్య‌రావు మాదాడి, డైరెక్ట‌ర్ కె.క్రాంతి మాధ‌వ్ కాంబోలో రూపొందుతున్న చిత్రం ‘దిల్ దియా-ఏ నేక్డ్ ట్రూత్’.

Sandeep Reddy Vanga: ‘దిల్ దియా’ నుంచి చైతన్యరావు ఫస్ట్ లుక్.. చిత్రం చెప్పే కథేంటంటే..

వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో విల‌క్ష‌ణ న‌టుడిగా త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న చైత‌న్య‌రావు మాదాడి, డైరెక్ట‌ర్ కె.క్రాంతి మాధ‌వ్ కాంబోలో రూపొందుతున్న చిత్రం ‘దిల్ దియా-ఏ నేక్డ్ ట్రూత్’. శ్రియాస్ చిత్రాస్‌, ఎ పూర్ణ నాయుడు ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్స్‌పై పూర్ణ నాయుడు నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫ‌స్ట్ లుక్‌ను సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ సందీప్ రెడ్డి వంగా విడుద‌ల చేశారు. భావోద్వేగాలు, వ్యక్తిగత సంబంధాల మధ్య వచ్చే భావోద్వేగాల నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది.

క్రాంతి మాధవ్ ఇప్పటి వరకూ చేసిన భావోద్వేగాల సినీ ప్రయాణానికి కొనసాగింపుగానే ఉంటుంది. క్రాంతి మాధవ్ సారధ్యంలో వచ్చిన ఓనమాలు, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, వరల్డ్ ఫేమస్ లవర్ వంటి సినిమాల‌ను గ‌మ‌నిస్తే.. ప్రేమ, మ‌న‌సుల్లోని భావాలు, అంతర్గత సంఘర్షణలు పాత్ర‌ల రూపంలో స్పష్టంగా కనిపిస్తాయి. ప్రస్తుతం ఆయన రూపొందిస్తున్న ‘దిల్ దియా – ఏ నేక్డ్ ట్రూత్’ సైతం ఆ కోవకు చెందినదే. మరోసారి ఎమోషనల్ వరల్డ్‌తో ఓవర్ డ్రామా కాకుండా ప్రేక్షకులను మెప్పించేందుకు క్రాంతి మాధవ్ సిద్ధమవుతున్నారు. ఈ చిత్రంలో చైతన్యరావుతో పాటు ఇరా, స‌ఖి, జెస్సీ ప్ర‌ధాన పాత్ర‌ల్లో కనిపించనున్నారు.

కీలక పాత్రల్లో మ‌ణి చంద‌న‌, ప్ర‌మోదిని, వీర శంక‌ర్ తదితరులు నటిస్తున్నారు. బ‌ట్ట‌లు లేకుండా సొఫాలో కూర్చున్న చైత‌న్య రావును ఫస్ట్‌లుక్ పోస్టర్‌గా మేకర్స్ వదిలారు. ర‌గ్డ్ లుక్‌తో చైతన్యారావు కనిపిస్తుండగా.. వెనుక నుంచి ప్రొజెక్ట‌ర్ లైటింగ్ వ‌స్తోంది. త‌న చూపుల్లోని ఇంటెన్సిటీ.. త‌న పాత్ర‌లోని సీరియ‌స్‌నెస్‌ను తెలియ‌జేస్తోంది. మొత్తానికి ఈ చిత్రం ప్రేమ, భావోద్వేగాల కలయికలో రానుంది. పూర్ణా నాయుడు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో ముఖ్యంగా క్రాంతి మాధవ్.. యూత్‌ను టార్గెట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆధునిక సంబంధాలను ఎలాంటి ఫిల్టర్స్ లేకుండా చూపించనున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రం ఈ ఏడాది వేసవిలో విడుదల కానుంది.

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
January 4, 2026 6:06 AM