Entertainment

Ram Charan- Allu Arjun: సందర్భం ఏదైనా ఫ్యాన్స్‌కు ఇంట్రస్టింగ్ మూమెంట్

కొన్ని కలయికలు చాలా ఆనందాన్నిస్తాయి. ముఖ్యంగా హీరోల విషయంలో ఇది జరుగుతూ ఉంటుంది. మెగా ఫ్యామిలీ.. అల్లు ఫ్యామిలీ వేరైపోయిందంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది.

Ram Charan- Allu Arjun: సందర్భం ఏదైనా ఫ్యాన్స్‌కు ఇంట్రస్టింగ్ మూమెంట్

కొన్ని కలయికలు చాలా ఆనందాన్నిస్తాయి. ముఖ్యంగా హీరోల విషయంలో ఇది జరుగుతూ ఉంటుంది. మెగా ఫ్యామిలీ.. అల్లు ఫ్యామిలీ వేరైపోయిందంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. మెగా హీరో ట్యాగ్‌ లైన్ నుంచి అల్లు అర్జున్ బయటకు వచ్చేసి ఐకాన్ స్టార్‌గా మారి చాలా కాలం అవుతోంది. అసలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. అల్లు అర్జున్ ఇద్దరూ ఇటీవలి కాలంలో కలిసిందే లేదు. తాజాగా రామ్ చరణ్ వెళ్లి అల్లు అర్జున్‌ను హగ్ చేసుకోవడం ఆసక్తికరంగా మారింది.

ఇవాళ (శనివారం) తెల్లవారుజామున అల్లు రామలింగయ్య సతీమణి (Allu Ramalingaiah Wife), అల్లు అర్జున్ (Allu Arjun) నాయినమ్మ అల్లు కనకరత్నం మరణించారు. రామ్ చరణ్‌ (Ram Charan)కు కనకరత్నం అమ్మమ్మ కావడంతో ఆయన కూడా మైసూర్‌ (Mysore)లో జరుగుతున్న ‘పెద్ది (Peddi)’ మూవీ షూటింగ్‌ క్యాన్సిల్ చేసి హుటాహుటిన హైదరాబాద్‌ (Hyderabad)కు వచ్చేశారు. విషయం తెలిసిన వెంటనే అల్లు అర్జున్ సైతం ముంబై (Mumbai)లో అట్లీ (Director Atlee)తో చేస్తున్న మూవీ షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని హైదరాబాద్‌కు వచ్చేశాడు. అల్లు అర్జున్ నివాసంలో కనకరత్నం భౌతికకాయాన్ని ఉంచారు. రామ్ చరణ్ రాగానే ఎదురుగా అల్లు అర్జున్ కనిపించడంతో ఆయనను హగ్ చేసుకున్నాడు. అనంతరం వెళ్లి తన అమ్మమ్మ భౌతికకాయాన్ని సందర్శించుకున్నాడు. ఆ తరువాత కూడా వీరిద్దరూ పక్కపక్కనే కూర్చొన్నారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియా (Social Media)లో వైరల్ అయ్యాయి. సందర్భం ఏదైనా కూడా రామ్ చరణ్‌ అలా అల్లు అర్జున్‌ను హగ్ చేసుకోవడం ఆసక్తికరంగా మారింది.

దూరం పెరుగుతూనే ఉంది..

చాలా కాలంగా మెగా (Mega Family), అల్లు ఫ్యామిలీ (Allu Family)ల మధ్య దూరం పెరిగిందంటూ వార్తలు వినవస్తున్నాయి. ఎందుకు విభేదాలు వచ్చాయో తెలియదు కానీ బన్నీ, చెర్రీల మధ్య దూరం పెరిగిందన్న వార్తలైతే గట్టిగానే వినిపించాయి. దానిని ధృవీకరించేలా వారిద్దరి ప్రవర్తన కూడా కొనసాగింది. ఏదైనా సందర్భం వస్తే మెగా, అల్లు ఫ్యామిలీలు ఒకరికొకరు సపోర్ట్ చేసుకున్నా కూడా రామ్ చరణ్, అల్లు అర్జున్‌ల మధ్య మాత్రం డిస్టెన్స్ కొనసాగుతూనే ఉంది. ‘పుష్ప 2 (Pushpa 2)’ వివాదంలో అల్లు అర్జున్‌ను అరెస్ట్ (Allu Arjun Arrest) చేసిన సమయంలోనూ.. విషయం తెలిసిన వెంటనే మెగా ఫ్యామిలీ అంతా పరామర్శకు వెళ్లింది కానీ రామ్ చరణ్ వెళ్లినట్టు ఎక్కడా కనిపించలేదు. కనీసం సోషల్ మీడియా వేదికగా కూడా ఒక పోస్ట్ కూడా పెట్టింది లేదు. అలాంటిది ఇంత కాలానికి ఇద్దరూ కలిసి కనిపించారు.

 

 

 

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
August 30, 2025 1:11 PM