Rajinikanth: రజినీకాంత్, ధనుష్ నివాసాల్లో బాంబు కలకలం..
తమిళనాట (Tamilnadu) మరోసారి బాంబు బెదిరింపుల కలకలం రేగుతోంది. తాజాగా తమిళనాట అగ్ర నటులు రజినీకాంత్ (Rajinikanth), ధనుష్ (Dhanush)కు బాంబు బెదిరింపులు రావడం సంచలనం రేపుతున్నాయి.
తమిళనాట (Tamilnadu) మరోసారి బాంబు బెదిరింపుల కలకలం రేగుతోంది. తాజాగా తమిళనాట అగ్ర నటులు రజినీకాంత్ (Rajinikanth), ధనుష్ (Dhanush)కు బాంబు బెదిరింపులు రావడం సంచలనం రేపుతున్నాయి. ఈ క్రమంలోనే గుర్తు తెలియని వ్యక్తులు చెన్నై డీజీపీ కార్యాలయానికి (Chennai DGP Office) ఇవాళ (మంగళవారం) తెల్లవారుజామున రజినీకాంత్ (Rajinikanth), ధనుష్ (Hero Dhanush) ఇళ్లతో పాటు కీల్పాక్కంలో ఉన్న టీఎన్‌సీసీ అధ్యక్షుడు సెల్వపెరుతంగై ఇళ్లకు బాంబు బెదిరింపుతో కూడిన ఈ మెయిల్ వచ్చింది. తక్షణమే చెన్నైలో బాంబు స్క్వాడ్ బృందాలు, డాగ్ స్క్వాడ్‌ల సహాయంతో పోలీసులు రజినీకాంత్, ధనుష్ నివాసాలకు వెళ్లగా వారు తిరస్కరించారని తెలుస్తోంది.
తేనాంపేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇవాళ ఉదయం తొలి బెదిరింపు బాంబు మెయిల్ రజినీకాంత్ ఇంటికి వచ్చిందని తెలిపారు. తక్షణమే అక్కడికి చేరుకున్న సమయంలో రజినీకాంత్ భద్రతా బృదం అవసరం లేదని తెలిపిందన్నారు. మళ్లీ అదే రోజు సాయంత్రం 6.30 గంటలకు ధనుష్ నివాసానికి సంబంధించి రెండో బెదిరింపు మెయిల్ రావడంతో అక్కడకు వెళ్లగా.. ధనుష్ సైతం పోలీసుల సాయాన్ని తిరస్కరించారట. ఈ మధ్య కాలంలో తమిళనాడులో ఇదొక అలవాటుగా మారిపోయింది. తమిళనాడు సీఎం స్టాలిన్ (CM Stalin) సహా, సినీ నటి త్రిష (Heroine Trisha) నివాసాల్లో అక్టోబర్ 3న బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. అనంతరం అక్టోబర్ 13న సైతం స్టాలిన్‌కు బాంబ్ బెదిరింపు కాల్స్ వచ్చాయి.
ప్రజావాణి చీదిరాల