OTT Release: ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ‘మహావతార్ నరసింహా’
రెండంటే రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 7 కోట్ల నెట్ కలెక్షన్స్‌తో రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా ఇంతటి విజయాన్ని సాధిస్తుందని మేకర్స్ కూడా ఊహించి ఉండరు.

కనీసం ఫలానా పేరుతో సినిమా ఉందని కూడా తెలియకుండా విడుదలై మంచి బాక్సాఫీస్ సక్సెస్ (Boxoffice Success) కొట్టన చిత్రాలు వేళ్లమీద లెక్కపెట్టగలిగినన్ని కూడా ఉండవు. ఇటీవలి కాలంలో ఇలాంటి సినిమా గురించి చెప్పాల్సి వస్తే ‘మహావతార్ నరసింహా’ (Mahavatar Narasimha) గురించి చెప్పాలి. ఈ చిత్రం జూలై 25న విడుదలై ఊహించని విధంగా కలెక్షన్స్ రాబట్టింది. కేవలం మౌత్ టాక్ (Mouth Talk)తో ఈ సినిమా కోట్లు కొల్లగొట్టి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. రెండంటే రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 7 కోట్ల నెట్ కలెక్షన్స్‌తో రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా ఇంతటి విజయాన్ని సాధిస్తుందని మేకర్స్ కూడా ఊహించి ఉండరు. మహా విష్ణువు (Maha Vishnuvu) దశావతారాల ఆధారంగా ఈ చిత్రం రూపొందింది.
'మహావతార్' సినిమాటిక్ యూనివర్స్ (MCU) పేరుతో తొలి చిత్రంగా ఈ సినిమాను విడుదల చేశారు. థియేటర్ల (Cinema Theaters)లో కొందరు ఈ సినిమాను చూడటం మిస్ అయి ఉండొచ్చు.. లేదంటే మరోసారి చూడాలని ఫీల్ అయి ఉండొచ్చు. వారందరికీ గుడ్ న్యూస్ మహావతార్ నరసింహా ఓటీటీ రిలీజ్ (Mahavathar Narasimha OTT Release) డేట్ ఫిక్స్ అయిపోయింది. ఇటీవలే ఈ చిత్రం 200 థియేటర్స్‌కు పైగా 50 రోజులు పూర్తి చేసుకుని సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ క్రమంలోనే మేకర్స్ ఓటీటీ డేట్‌ను రివీల్ చేశారు. అది ఎప్పుడో కాదు. ఈ రోజు (సెప్టెంబర్ 19న) మధ్యాహ్నం 12:30 గంటలకు స్ట్రీమింగ్ అయిపోయింది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అయ్యింది. ఇంకెందుకు ఆలస్యం చూడని వాళ్లు ఎవరున్నా కూడా ఓటీటీలో ఈ సినిమాను వీక్షించి ఎంజాయ్ చేయండి.