Biggboss9: కౌంట్‌డౌన్ స్టార్ట్.. హౌస్‌లోకి అడుగు పెట్టేది వీరే..!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9కు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. మరో రెండు రోజుల్లో అంటే సెప్టెంబర్ 7 ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి కింగ్ నాగార్జున హోస్టింగ్‌లో బిగ్‌బాస్ సీజన్ 9 ప్రారంభం కానుంది.

బిగ్ బాస్ తెలుగు (Biggboss Telugu) సీజన్ 9 (biggboss 9)కు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. మరో రెండు రోజుల్లో అంటే సెప్టెంబర్ 7 ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి కింగ్ నాగార్జున (King Nagarjuna) హోస్టింగ్‌లో బిగ్‌బాస్ సీజన్ 9 ప్రారంభం కానుంది. ఇప్పటికే అగ్నిపరీక్ష ద్వారా కామన్ మ్యాన్ ఎంపిక జరుగుతోంది. కామన్ మ్యాన్ కేటగిరీ నుంచి ఆరుగురు హౌస్‌లోకి వెళ్లనున్నారని టాక్. ఆ ఆరుగురి పేర్లు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. మాస్క్ మాన్ హరీష్ (Mask Man Harish), మర్యాద మనీష్ (Maryada Manish), దమ్ము శ్రీజ (Srija Dammu), ఆర్మీ పవన్ కల్యాణ్ (Pawan Kalyan), ప్రియ, డెమాన్ పవన్ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఈసారి బిగ్‌బాస్ సీజన్ 9లో కామన్ మ్యాన్ (Common Man) వర్సెస్ సెలబ్రిటీ (Celebrity)గా ఉండబోతోంది.
ఇక సెలబ్రిటీల విషయానికి వస్తే ఆశా షైనీ (Asha Saini), సంజనా గర్లానీ (Sanjana Garlani), తనూజ గౌడ, యాక్టర్ భరణి, ఇమ్మాన్యుయేల్ (Immanuel), సుమన్ శెట్టి, ఫోక్ సింగర్ రాము రాథోడ్ (Ramu Rathod), శ్రేష్టి వర్మ (Sreshti Varma) తదితరులు ఉన్నారు. ఈ లిస్ట్ ఎంతమేరకు కరెక్ట్ అనేది మరికొన్ని గంటల్లో తేలుతుంది. ఇక సెలబ్రిటీల లిస్ట్ కూడా తక్కువగానే ఉంది కాబట్టి మరికొందరు వీరికి యాడ్ అయ్యే అవకాశం ఉంది. మొత్తానికి కామన్ మ్యాన్ కేటగిరి నుంచి ఎంపికయ్యే వారిని ఇక మీదట కామన్ మ్యాన్ అనడానికి లేదు. ఎందుకంటే అగ్నిపరీక్ష ద్వారా వారికి కావల్సినంత పాపులారిటీ అయితే వచ్చేసింది. టాప్ 15ను తీసుకుని వారితో కొద్ది రోజుల పాటు అగ్ని పరీక్ష అంటూ కొన్ని గేమ్స్ ఆడించారు.
వారి ఐక్యూ టెస్ట్ సహా ప్రతి ఒక్క పరీక్షను నిర్వహించారు. వాస్తవానికి ఇది అంత ఆశాజనకంగా లేకున్నా కూడా కంటెస్టెంట్స్ (Biggboss Contestants)కి అయితే ఇది బాగా ప్లస్ అయ్యిందని చెప్పాలి. అయితే డీమాన్ పవన్ విషయంలోనే కొంత సందేహం వ్యక్తం చేస్తున్నారు. అతని స్థానంలో నాగ బిగ్‌బాస్ హౌస్ (Biggboss House)లోకి అడుగు పెట్టినా ఆశ్చర్యం లేదు. వాస్తవానికి డీమాన్ పవన్ కంటే నాగ చాలా ఎఫిషియంట్ అని ఇప్పటి వరకూ జరిగిన అగ్ని పరీక్ష ద్వారా అనిపించుకున్నాడు. టోటల్‌గా కామన్ మ్యాన్ కేటగిరీ నుంచి ఆరుగురు, సెలబ్రిటీల నుంచి 9 మంది మాత్రమే.. మొత్తంగా 15 మందే కాబట్టి గత సీజన్ మాదిరిగా మధ్యలో వైల్డ్ కార్డు ద్వారా కొందరిని హౌస్‌లోకి ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. ఇక చూడాలి ఏం జరుగుతుందో..