Biggboss9: బిగ్ ట్విస్ట్ ఇచ్చిన బిగ్‌బాస్.. షో మొత్తాన్ని దోశ తిప్పినట్టు తిప్పేశారు..
మొత్తానికి రీతూ చౌదరి దెబ్బో మరొకటో కానీ బిగ్‌బాస్ అయితే బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు. కంప్లీట్‌గా షోనే దోశ తిప్పినట్టుగా తిప్పేశాడు. బిగ్‌బాస్‌కి సంబంధించిన సెకండ్ ప్రోమో వచ్చేసింది.

మొత్తానికి రీతూ చౌదరి (Rithu Chowdary) దెబ్బో మరొకటో కానీ బిగ్‌బాస్ (Biggbogss) అయితే బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు. కంప్లీట్‌గా షోనే దోశ తిప్పినట్టుగా తిప్పేశాడు. బిగ్‌బాస్‌కి సంబంధించిన సెకండ్ ప్రోమో వచ్చేసింది. లేటెస్ట్ అప్‌డేట్‌కి సంబంధించిన ప్రోమో అది. మొదటి ప్రోమోలో అయితే డెమాన్ పవన్ (Demon Pawan) నుంచి కెప్టెన్సీని తీసేశారు. ఇక రెండో ప్రోమో విషయానికి వస్తే.. శ్రీజ దమ్ము (Srija Dammu), ప్రియ (Priya)లకు ఇవ్వాల్సిన డోస్ ఇచ్చేశారు. ప్రియ సంచాలక్‌గా వ్యవహరించిన బొమ్మల టాస్క్‌కు సంబంధించి వీడియో ప్లే చేసి చూపించారు. దానిలో సుమన్ శెట్టి (Suman Shetty) కనీసం ఫ్లోరా శైనీ (Flora Shaini), సంజనా (Sanjana Garlani)లను టచ్ చేసినట్టుగా కూడా లేదు. కానీ అతను వాళ్లిద్దరినీ కొట్టాడని ఆట నుంచి ప్రియ తప్పించింది. ఆ వీడియోను ప్లే చేసి ఆమెకు నాగ్ (Host Nagarjuna) క్లాస్ తీసుకున్నారు.
ఆ తరువాత ఇక మీదట దోశ తిప్పినట్టుగా హౌస్ (Biggboss House) మొత్తాన్ని బిగ్‌బాస్ తిప్పాడనుకున్నాం కదా.. అదేంటంటే.. రెంటల్స్ అంతా ఇక మీదట ఓనర్స్.. ఓనర్స్ అంతా రెంటల్స్ అని చెప్పి వారందరికీ అదిరిపోయే షాక్ ఇచ్చాడు. ప్రస్తుతం ఓనర్స్‌గా కొనసాగుతున్న వారంతా అది వినగానే షాక్ అయ్యారు. ఇక రెంటల్స్‌గా ఉన్నవారైతే చాలా హ్యాపీ ఫీలయ్యారు. మొత్తానికి వీకెండ్ ఎపిసోడ్ అంతా చాలా ఆసక్తికరంగా బిగ్‌బాస్ టీం (Biggboss Team) డిజైన్ చేసినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా కామనర్స్‌కు బయట నెగిటివిటీ పెరిగిపోతోంది. దానిని తగ్గించేందుకు బిగ్‌బాస్ అయితే శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. పనిలో పనిగా హరిత హరీష్ (Haritha Harish)కు కూడా నాగ్ క్లాస్ తీసుకున్నారు. దమ్ముంటే బిగ్‌బాస్ నన్ను బయటకు పంపించు అంటూ హరీష్ అన్న మాటలను గుర్తు చేసి పంపించేయమంటావా? ఇంట్లో ఉంటావా? అంటూ నాగ్ క్లాస్ తీసుకున్నారు. నాగ్ తీసుకున్న క్లాస్‌తో హౌస్ అంతా సెట్ అవుతుందో లేదంటే.. ఇంకా అలాగే ఉంటుందో చూడాలి.