Entertainment

మొదటిరోజే గేమ్ మొదలు పెట్టేసిన బిగ్‌బాస్..

బిగ్‌బాస్ సీజన్ 9 తెలుగు గ్రాండ్‌గా ప్రారంభమైంది. మొత్తానికి పెద్దగా హైప్ అనేది ఏమీ అనిపించలేదు. ఏదో సో సోగా సాగిపోయింది. సెలబ్రిటీస్ నుంచి ముందుగా ఇమ్మాన్యుయేల్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.

మొదటిరోజే గేమ్ మొదలు పెట్టేసిన బిగ్‌బాస్..

బిగ్‌బాస్ సీజన్ 9 తెలుగు (Biggboss Season 9 Telugu) గ్రాండ్‌గా ప్రారంభమైంది. మొత్తానికి పెద్దగా హైప్ అనేది ఏమీ అనిపించలేదు. ఏదో సో సోగా సాగిపోయింది. సెలబ్రిటీస్ నుంచి ముందుగా ఇమ్మాన్యుయేల్ (Emmanuel) హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక కామనర్స్ నుంచి ముందుగా ఆర్మీ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) బిగ్‌బాస్ హౌస్‌ (Biggboss House)లోకి అడుగు పెట్టగా.. ఆ తరువాత హరితా హరీష్ (Haritha Harish) అడుగు పెట్టాడు. సెలబ్రిటీస్ నుంచి ఆషా శైని (Asha Saini), తనూజా గౌడ (Tanuja Gowda), షష్టి వర్మ (Shasti Varma), దివ్య అలియాస్ రీతూ చౌదరి (Rithu Chowdary), భరణి (Bharani) వెళ్లారు. భరణి (Actor Bharani) విషయంలో చిన్న డ్రామా అయితే ప్లే చేశారు. తనొక బాక్స్‌తో రావడం.. అదేంటో బిగ్‌బాస్ హౌస్‌లోనే చెబుతాననడం.. అతడిని బయటకు పంపేయడం.. కాసేపటికి తిరిగి పిలవడం వంటివి జరిగాయి. అయితే బాక్స్‌లో కేవలం ఒక లాకెట్ ఉంది. మరి దానిని చెప్పడానికి భరణి ఎందుకు అంతలా ఫీలయ్యాడో తర్వాత వచ్చి ఎందుకు చెప్పాడో అతనికే తెలియాలి. మొత్తానికి దీనిని చూస్తుంటే బిగ్‌బాస్ (Biggboss) తొలి రోజే గేమ్ మొదలు పెట్టేశాడు.

మూడవ కామనర్‌గా డిమన్ పవన్ బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టాడు. నెక్ట్స్ బిగ్‌బాస్‌ హౌస్‌లోకి సెలబ్రిటీ నుంచి ‘బుజ్జిగాడు (Bujjigadu)’ హీరోయిన్ సంజనా గల్రానీ (Heroine Sanjana Garlani) అడుగు పెట్టింది. ఆమె ప్రస్తుతం చూస్తే చాలా ఫ్యాటీగా మారింది. సన్నగా రివటలా ఉంటుంది ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. తన ఏవీలో భాగంగా తన అరెస్ట్ గురించి చెప్పుకొచ్చింది. గతంలో అంటే 2020లో డ్రగ్స్ (Drugs) రవాణా ఆరోపణలపై సంజనాను బెంగుళూరు సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె సన్నిహితులు రాహుల్, పృథ్వీశెట్టి ఇచ్చిన సమాచారం ఆధారంగా ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయమై బిగ్‌బాస్ హౌస్‌లో సంజనా స్పందించింది. తను అమాయకురాలిని అన్నట్టుగా చెప్పుకొచ్చింది.

ఆ తరువాత సెలబ్రిటీ కేటగిరీ నుంచి సింగర్, డ్యాన్సర్ రాము రాథోడ్ (Ramu Rathod) వచ్చాడు. ఆ తరువాత శ్రీజ దమ్ము (Srija Dammu), సునీల్ శెట్టి (Sunil Shetty) అడుగు పెట్టాడు. చివరి కామనర్‌గా ప్రియా శెట్టి (Priya Shetty) బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టింది. మొత్తంగా కామనర్స్ నుంచి ఐదుగురు బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టారు. శ్రీముఖి (Anchor Srimukhi) ఎంట్రీ ఇచ్చింది. మరొక్క కామనర్‌ని హౌస్‌లోకి పంపిద్దామని కోరగా.. నాగ్ ఓకే అన్నారు. దీంతో అభిజిత్‌ (Abhijith)తో కలిసి తాను ఈ డెసిషన్ తీసుకున్నాట్టు చెప్పి మర్యాద మనీష్‌ (Maryada Manish)ను హౌస్‌లోకి శ్రీముఖి పంపించింది. మొత్తంగా 15 మంది హౌస్‌లోకి అడుగు పెట్టారు. వారిలో సెలబ్రిటీలు 9 మంది.. ఆరుగురు కామనర్స్. ఇక రెండు గ్రూపులుగా విభజించి.. ఓనర్స్, టెనెంట్స్‌గా డివైడ్ చేశారు. ఓనర్స్ వచ్చేసి కామనర్స్‌.. టెనెంట్స్ వచ్చేసి సెలబ్రిటీలు. అవుట్ హౌస్‌లో సెలబ్రిటీలు ఉంటారు.

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
September 7, 2025 4:37 PM