బిగ్‌బాస్ హోస్ట్ చేంజ్.. నయనతార ఎంట్రీ?
బిగ్‌బాస్‌లో మేల్ డామినేషన్ ఎక్కువ అవడంతో ఈ సారి లేడీ బాస్‌కి హోస్టింగ్ బాధ్యతలు అప్పగించాలని బిగ్‌బాస్ నిర్వాహకులు భావిస్తున్నారట. ఈ క్రమంలోనే నిర్వాహకులు సైతం ఆమెను కలిసి దీనిపై చర్చించినట్టు సమాచారం.

బిగ్‌బాస్ (Biggboss) హోస్టింగ్ అంటే సాధారణ విషయమా? అయినా సరే.. ఎన్నో విమర్శలను ఎదుర్కోవాలి. నవ్వించాలి.. అవసరమైతే కొరడా ఝుళిపించాలి. ఇది కత్తిమీద సాము లాంటి వ్యవహారం. అయితే ఈసారి బిగ్‌బాస్ హోస్ట్ (Biggboss Host) మారిపోయాడు. కత్తి మీద సాము చేసేందుకు లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanatara) సిద్ధమవుతోంది. అయితే తెలుగు బిగ్‌బాస్ కాదులెండి.. హిందీ బిగ్‌బాస్.. గతంలో బాలీవుడ్ బిగ్‌బాస్‌ని రెండు సార్లు లేడీ బాస్‌లు హోస్ట్ చేశారు. వారిలో ఒకరు శిల్పా శెట్టి కాగా.. మరొకరు ఫరాఖాన్. ఆ తరువాత నుంచి అర్దర్ వార్షీ, అమితాబ్ (Amitab), సల్మాన్ (Salman Khan), అమీర్ ఖాన్ (Amirkhan) హోస్టింగ్ చేస్తూ వచ్చారు. ఇక ఇప్పుడు మాత్రం లేడీ బాస్ ఏమిటీ? సల్మాన్ ఏమయ్యారు అనుకుంటున్నారా?
బిగ్‌బాస్‌లో మేల్ డామినేషన్ ఎక్కువ అవడంతో ఈ సారి లేడీ బాస్‌కి హోస్టింగ్ బాధ్యతలు అప్పగించాలని బిగ్‌బాస్ నిర్వాహకులు భావిస్తున్నారట. ఈ క్రమంలోనే నిర్వాహకులు సైతం ఆమెను కలిసి దీనిపై చర్చించినట్టు సమాచారం. నయనతార సైతం బిగ్‌బాస్‌కు హోస్టింగ్ నిర్వహించేందుకు పాజిటివ్‌గానే స్పందించినట్టు తెలుస్తోంది కానీ గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వలేదట. తనకు ఆలోచించుకునేందుకు కొంత సమయం ఇవ్వాలని.. తన స్పందన ఏదైనా కానీ బిగ్‌బాస్ నిర్వాహకులు పాజిటివ్‌గానే తీసుకోవాలని తెలిపిందట. ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్, అడ్వర్‌టైజ్‌మెంట్స్ వాటికి దూరంగా ఉంటున్న నయన్.. ఇప్పుడు బిగ్‌బాస్ హోస్టింగ్‌కి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? అనేది సందేహమే. అయితే ఇప్పటి వరకూ నయనతార ఇలాంటి ప్రోగ్రాంలకు హోస్టింగ్ చేసింది లేకపోవడంతో.. ఆమె హోస్టింగ్ చేస్తే చూడాలని అభిమానులు ఆశగా ఉన్నారు.