Biggboss Agnipariksha: అగ్నిపరీక్ష వీళ్లకా.. మాకా?
బిగ్‌బాస్ అగ్ని పరీక్ష షో చూస్తుంటే సమాజంలో ఇన్ని రకాలైన వింత క్యారెక్టర్స్ ఉన్న మనుషులు ఉన్నారా? అనిపిస్తుంది. వింత మనస్తత్వాలు చూడటానికే ఆశ్చర్యమనిపించేవారు కొందరైతే..

బిగ్‌బాస్ అగ్ని పరీక్ష షో చూస్తుంటే సమాజంలో ఇన్ని రకాలైన వింత క్యారెక్టర్స్ ఉన్న మనుషులు ఉన్నారా? అనిపిస్తుంది. వింత మనస్తత్వాలు చూడటానికే ఆశ్చర్యమనిపించేవారు కొందరైతే.. విసుగు తెప్పించేవారు కొందరు.. అలాగే రవి దోమన వంటి వ్యక్తులు కూడా ఉన్నారా? అనిపిస్తుంది.
అయితే బిగ్‌బాస్ (Biggboss) అగ్నిపరీక్ష (Biggboss Agnipariksha) ఒక రౌండ్ అయితే పూర్తయింది. ఇప్పటికే బిగ్‌బాస్ హౌస్‌లోకి దాదాపు నలుగురిని పంపించారు. కొందరిని హోల్డ్‌లో పెట్టారు. వీరికి మరో రౌండ్ ఉంటుంది. ఈ రౌండ్‌లో సెలక్ట్ అయినవారు బిగ్‌బాస్ హౌస్ (Biggboss House)లోకి అడుగు పెడతారు. మరి లక్కీఫెలోస్ ఎవరో తెలియాల్సి ఉంది. ఇవాళ (శనివారం) జరిగిన అగ్నిపరీక్షకు మొదటగా డెమాన్ పవన్ వచచ్చాడు. ఇతనొక స్పోర్ట్స్ పర్సన్. ఓ కామిక్ బుక్ చదివి డెమాన్ అని పెట్టుకున్నాడట. మొత్తానికి ఏవో స్టంట్స్ చేసి జడ్జిలైన నవదీప్, అభిజిత్‌లను మెప్పించాడు. బిందుమాధవి మాత్రం డార్కెస్ట్ సీక్రెట్ చెప్పమంటే చెప్పేశాడు. దీంతో డెమాన్ పవన్‌ను వేరొక ఆలోచన లేకుండా సెలక్ట్ చేశాడు. మొత్తానికి ఇతనికి బిగ్‌బాస్ ఎంట్రీ ఫిక్స్.
నెక్ట్స్ శ్రీజ దమ్ము వచ్చింది. ఈమె ఒక సాఫ్ట్‌వేర్ డెవలపర్. శ్రీముఖిని మించి అరుపులు, కేకలు పెట్టి అందరికీ విసుగు తెప్పించింది. అభి అయితే అగ్నిపరీక్ష వీళ్లకా..? మాకా? అని క్వశ్చన్ చేశాడు. అంతలా విసుగు తెప్పించిందామె. ఈమెను అంతా డబ్బా రేకుల రాణి అంటారట. అభిజిత్ అయితే ఒక్క మాట కూడా మాట్లాడకుండా రెడ్ ఇచ్చేశాడు.. వాయిస్ ఇరిటేషన్ అని చెప్పి బిందు మాధవి రెడ్ ఇవ్వగా.. నవదీప్ మాత్రం పబ్లిక్ వాంట్స్ దట్ అతి అని చెప్పి గ్రీన్ ఇచ్చాడు. ఆ తరువాత ఊర్మిళా చౌహాన్ వచ్చింది. ఆమె ఫెమినా మిస్ తెలంగాణ 2023. ర్యాంప్ వాక్ చేసింది. ఆమెతో పిడకలు కొట్టించిన మీదట జెన్యూనిటీ లేదని అభి రెడ్ ఇచ్చాడు. బిందు మాధవి కూడా రెడ్ ఇవ్వగా.. నవదీప్ ఏవో రెండు కారణాలను పరిగణలోకి తీసుకుని గ్రీన్ ఇచ్చాడు. ఆమె కూడా హోల్డ్‌లో ఉంది. ఆ తరువాత హైదరాబాద్ నుంచి పాత్రూని చిదానంద శాస్త్రి ఎంట్రీ ఇచ్చాడు. ఇతను తనను తాను డ్రాగ్ క్వీన్‌గా పరిచయం చేసుకున్నాడు. పురుషుడే కానీ స్త్రీలా వేషధారణ చేసుకుని డ్రాగ్ చేస్తుంటాడు. వేషధారణ అంతా డిఫరెంట్‌గా ఉంది. ఒక పాట కూడా పాడి తన టాలెంట్ ఏంటో చూపించాడు. తరువాత తను అసలేంటనేది కూడా నార్మల్‌గా వచ్చి చూపించాడు కానీ ఇంట్రస్టింగ్ అ
ఆ తరువాత వీర నరసింహ అలియాస్ నర్సయ్య తాత.. వచ్చాడు. అతనికి హౌస్‌లో ఒదగగలరో లేదో డౌట్ అని బిందు రెడ్ ఇచ్చింది. ఆతరువాత శ్రీముఖి పెట్టిన ఒక టాస్క్ చేసి చూపించాడు. అయినా కూడా నవదీప్, అభి కూడా రెడ్ ఇచ్చారు. నెక్ట్స్ నాగ ప్రశాంత్ వచ్చాడు. అతనొక అడ్వకేట్.. కామెడీ కేరెక్టర్స్ రాస్తూ ఉంటాడట. తన తల్లి కూడా అడ్వకేట్ అని తెలిపాడు. బిందు, అభి రెడ్ ఇచ్చారు. నవదీప్ మాత్రం ఛాన్స్ ఇచ్చాడు.. అంటే గ్రీన్ ఇచ్చాడు. నెక్ట్స్ నెల్లూరు నుంచి శ్రేయ వచ్చింది. వస్తూ వస్తూనే యాంకరింగ్ స్టార్ట్ చేసింది. బీబీఏ ఫైనల్ ఇయర్ స్టూడెంట్.. ఆమెకు నవదీప్, బిందు మాదవి, అభిజిత్ ముగ్గురూ గ్రీన్ ఇచ్చేశారు. ఆ తరువాత రవి దోమన ఎంట్రీ ఇచ్చాడు. ఇతనొక డిఫరెంట్ క్యారెక్టర్. మగవాళ్లే గొప్ప అని.. వాళ్లకు తప్ప ఆడవాళ్లకు సమస్యలు కానీ.. కష్టాలు కానీ ఉండవని స్ట్రాంగ్‌గా చెప్పాడు. అతడు మాట్లాడిన విధానం జడ్జిలకే కాదు.. ఎవరికీ నచ్చదు. రియాలిటీలో బతకాలని అభి రెడ్ ఇచ్చాడు. మిగిలిన ఇద్దరు కూడా రెడ్ ఇచ్చారు.
ఆ తరువాత ప్లే బ్యాక్ సింగర్ శ్రీ తేజ.. రాజమండ్రి నుంచి వచ్చాడు. అతనొకప్లేబ్యాక్ సింగర్. చాలా మూవీస్‌లో పాడాడు. అతనికి నవదీప్ రెడ్ ఇచ్చాడు. బిందు రెడ్, అభి గ్రీన్ ఇచ్చాడు. ఆ తరువాత రిజెక్ట్ చేసిన కొందరిని చూపించారు. నెక్ట్స్ హైదరాబాద్ నుంచి మనీష్ మర్యాద ఎంట్రీ ఇచ్చాడు. అతని ప్రొఫైల్ చాలా ఇంట్రస్టింగ్.. అతనితో మాట్లాడిన మీదట నవదీప్ గ్రీన్, బిందు గ్రీన్, అభి మాత్రం ఒక టాస్క్ ఇచ్చాడు. మిమ్మల్ని మీరు ఒక కేరికేచర్ గీసుకోగలరా. అనగానే గీశాడు. అప్పుడు అభి వెళ్లి ఒక ఛాలెంజ్ విసిరాడు.. దానికి అతను బ్రెయిన్‌తో క్లియర్ చేయడం ఆసక్తికరంగా అనిపించింది. అయినా సరే.. అతని టాలెంట్‌ను ఇంకా చూడాలని ఉందంటూ అభి అతనికి రెడ్ ఇచ్చాడు. ఫైనల్‌గా కల్కి ఎంట్రీ ఇచ్చింది. ఆమె మిస్ తెలంగాణ రన్నరప్. ఆర్ధడాక్స్ ఫ్యామిలీ. తండ్రి అమ్మాయిలను వద్దనుకున్నాడట. కానీ తాము ముగ్గురు అమ్మాయిలం అని చెప్పుకొచ్చింది. బిందుతో ఆమ్ రెజ్లింగ్ చేసి విన్ అయ్యింది. తరువాత శ్రీముఖి వంతు.. ఆమెను కూడా ఓడించేసింది. అభి ఆమె ఫైటింగ్ స్పిరిట్‌ని అప్రిషియేట్ చేసి గ్రీన్, నవదీప్ కూడా గ్రీన్ ఇచ్చారు. బిందు తనను నెక్ట్స్ రౌండ్‌లో చూడాలని ఉందంటూ రెడ్ ఇచ్చింది.
ప్రజావాణి చీదిరాల