Entertainment

Shivaji: అందం నిండుగా కప్పుకునే దుస్తుల్లో ఉంటుంది కానీ కనిపించే సామాన్లలో కాదు..

గ్లామర్ అనేది ఒక దశ వరకే ఉండాలి. అది నేనెవరు కానీ చెప్పడానికి రేపొద్దున మళ్లీ అంతా బయలుదేరుతారు. స్వేచ్ఛ అనేది అదృష్టం. ఆ స్వేచ్ఛను కోల్పోవద్దు. మనకు గౌరవం అనేది వేషభాషలను బట్టే పెరుగుతుంది.

Shivaji: అందం నిండుగా కప్పుకునే దుస్తుల్లో ఉంటుంది కానీ కనిపించే సామాన్లలో కాదు..

హీరోయిన్‌ల అందం వాళ్లు వేసుకునే డ్రెస్‌లలో ఉంటుందని.. నిండుగా వేసుకుంటేనే గౌరవం ఉంటుందని నటుడు శివాజీ (Actor Sivaji) అన్నారు. శివాజీ ప్రధాన పాత్రలో నటించిన ‘దండోరా’ (Dhandoraa) చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం డిసెంబర్‌ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ బీభత్సంగా నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో శివాజీ కామెంట్స్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ ఈవెంట్‌కు యాంకర్ చీరకట్టులో రావడంపై శివాజీ స్పందించారు. యాంకర్ డ్రెస్ సెన్స్ బాగుందని ప్రశంసించారు.

ముఖ్యంగా హీరోయిన్లు ఏ బట్టలు పడితే ఆ బట్టలు వేసుకుని పోతే వారే దరిద్రం అనుభవించాల్సి వస్తుందని శివాజీ మర్యాదపూర్వకంగా చెప్పారు. ఎవరైనా ఏమనుకున్నా తనకు పోయేదేమీ లేదన్నారు. కానీ మీ అందం చీరలోనో.. నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటది తప్పితే సామాను కనబడే దానిలో ఏమీ ఉండదని శివాజీ చెప్పారు. అవి వేసుకున్నంత మాత్రాన చాలా మంది నవ్వుతూ ఉంటారు కానీ మనసులో మాత్రం దరిద్రపు ముండ ఇలాంటి బట్టలు వేసుకోకుంటే కాస్త మంచివి వేసుకోవచ్చు కదా.. బాగుంటావు కదా అని చెప్పాలనిపిస్తుందని.. కానీ అనలేమని అన్నారు. ఒకవేళ అలా అంటే స్త్రీ స్వాతంత్ర్యం.. స్వేచ్ఛ లేవా? అంటారని పేర్కొన్నారు.

స్త్రీ అంటే ప్రకృతి అని.. ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరుగుతుందని శివాజీ పేర్కొన్నారు.. స్త్రీ అంటే తన తల్లి అని.. చక్కగా ఎప్పటికీ గుండెల్లో కనిపిస్తూ ఉంటుందని తెలిపారు. ఒక సావిత్రమ్మ కానీ.. సౌందర్య.. ఈ జెనరేషన్‌లో రష్మిక.. అని పేర్కొన్నారు. వీళ్లంతా ఇంపాక్ట్ క్రియేట్ చేశారని కాబట్టి వెంటనే చెప్పగలుగుతున్నామన్నారు. గ్లామర్ అనేది ఒక దశ వరకే ఉండాలన్నారు. అది చెప్పేందుకు తానెవరంటూ   రేపొద్దున మళ్లీ అంతా బయలుదేరుతారన్నారు. స్వేచ్ఛ అనేది అదృష్టమని.. ఆ స్వేచ్ఛను కోల్పోవద్దని సూచించారు. మనకు గౌరవం అనేది వేషభాషలను బట్టే పెరుగుతుందన్నారు. ప్రపంచ వేదికలపై కూడా చీరకట్టుకున్న వారికే విశ్వసుందరి కిరీటాలు వచ్చాయని శివాజీ పేర్కొన్నారు.

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
December 23, 2025 5:17 AM