Entertainment

Prabhas: అప్పట్లో అభిమన్యుడు, కర్ణుడు, ఏకలవ్యుడు.. ఇప్పుడు ‘ఫౌజీ’

ప్రభాస్‌ (Prabhas), హను రాఘవపూడి (Hanu Raghavapudi) కాంబోలో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ ముందు నుంచి ప్రచారంలో ఉంది.

Prabhas: అప్పట్లో అభిమన్యుడు, కర్ణుడు, ఏకలవ్యుడు.. ఇప్పుడు ‘ఫౌజీ’

ప్రభాస్‌ (Prabhas), హను రాఘవపూడి (Hanu Raghavapudi) కాంబోలో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ ముందు నుంచి ప్రచారంలో ఉంది. ఇక ఇవాళ ప్రభాస్ పుట్టినరోజు (Prabhas Birthday) సందర్భంగా మూవీ టైటిల్‌ (Prabhas-Hanu Movie Title)ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రం పేరు అందరూ అనుకుంటున్నదే.. అదే ‘ఫౌజి’ (Fauzi). సినిమా టైటిల్‌ను ప్రకటిస్తూ ఒక పోస్టర్‌తో ప్రభాస్‌కు మేకర్స్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

‘‘పద్మవ్యూహాన్ని ఛేదించిన అభిమన్యుడు (Abhimanyu).. పాండవుల పక్షాన ఉన్న కర్ణుడు (Karna).. గురువు లేని ఏకలవ్యుడి మాదిరిగానే పుట్టకతోనే అతడు ఓ యోధుడు.. మన చరిత్రలో దాగిన అధ్యాయాల్లోని అత్యంత ధైర్యవంతుడైన సైనికుడి కథ ఇది. అతడే ‘ఫౌజీ’’ అంటూ పోస్టర్‌ను మేకర్స్ వదిలారు. మొత్తానికి ప్రభాస్ అయితే మునుపెన్నడూ చేయని పాత్రలో అయితే కనిపించనున్నాడు. ఇది ఫ్యాన్స్‌ (Prabhas Fans)కు అత్యంత ఆనందాన్నిస్తోంది. ప్రభాస్‌కు జంటగా సోషల్‌ మీడియా స్టార్‌ ఇమాన్వీ (Fauzi Heroine Imanvi) నటిస్తోన్న ఈ చిత్రం పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామా (Fauzi as Periodical Action Drama)గా రూపుదిద్దుకుంటోంది.

ఇప్పటి వరకూ మీరు చూడని కథను చూపిస్తున్నామని.. హను రాఘవపూడి గతంలోనే తెలిపారు. చూడని కథో కాదో కానీ... ప్రభాస్‌ను చూడని పాత్రలో చూస్తున్నామని అయితే నిస్సందేహంగా చెప్పవచ్చు. ‘సీతారామం’ (Sitharamam) తరువాత ఈ కథను సిద్ధం చేయడానికి సుమారు ఏడాదికి పైగానే సమయం పట్టిందని హను రాఘవపూడి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ప్రేక్షకులు తప్పకుండా థ్రిల్ ఫీలవుతారని ఆయన తెలిపారు. మొత్తానికి సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి.

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
October 23, 2025 6:54 AM