‘డైమండ్ డెకాయిట్’ ట్రైలర్‌ను లాంచ్ చేసిన ఏపీ స్పీకర్ అయ్యన్న, దిల్ రాజు
ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తుందని శిరీష్ రెడ్డి తెలిపారు. హీరో పర్ధ గోపాల్ మాట్లాడుతూ.. అయ్యన్నపాత్రుడు, అలాగే ప్రముఖ నిర్మాత దిల్ రాజు ‘డైమండ్ డెకాయిట్’ మూవీ ట్రైలర్‌ను ఆవిష్కరించి అభినందించడం సంతోషంగా ఉందన్నారు.
పర్ధ గోపాల్ హీరోగానూ.. నిర్మాతగానూ మారి రూపొందిస్తున్న చిత్రం ‘డైమండ్ డెకాయిట్’. దర్శకుడు సూర్య జి. యాదవ్ తెరకెక్కించిన ఈ చిత్ర ట్రైలర్‌ను ఆంధ్రప్రదేశ్ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, ప్రముఖ నిర్మాత, ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు ఆవిష్కరించారు. అనంతరం చిత్ర యూనిట్‌ను అభినందించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ వాకడ అప్పారావు, శివాజీరాజా, థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యేక అతిథులుగా స్టార్ నిర్మాత శిరీష్ రెడ్డి హాజరై చిత్ర యూనిట్‌ని అభినందించారు. ఇక ‘డైమండ్ డెకాయిట్’ ట్రైలర్ చాలా గ్రిప్పింగ్‌గానూ.. విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, కథలో ఉన్న థ్రిల్.. వంటి అంశాలు చాలా స్ట్రాంగ్ ఇంపాక్ట్‌ను క్రియేట్ చేస్తున్నాయి. ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తుందని శిరీష్ రెడ్డి తెలిపారు. హీరో పర్ధ గోపాల్ మాట్లాడుతూ.. అయ్యన్నపాత్రుడు, అలాగే ప్రముఖ నిర్మాత దిల్ రాజు ‘డైమండ్ డెకాయిట్’ మూవీ ట్రైలర్‌ను ఆవిష్కరించి అభినందించడం సంతోషంగా ఉందన్నారు. ట్రైలర్‌కు వస్తున్న స్పందన ఎంతో ఆనందంగా ఉందని.. ఇది సాధారణ కథ కాదని.. సస్పెన్స్, ఎమోషన్స్, థ్రిల్ అన్నీ కలిసిన పూర్తి ఎంటర్‌టైనర్‌గా ఉన్నాయన్నారు. ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతి ఇస్తుందని... ప్రతి ఒక్కరూ మా సినిమాను ఆదరించాలని కోరుతున్నామని తెలిపారు.
రచయిత, దర్శకుడు సూర్య జి యాదవ్ మాట్లాడుతూ.. స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, దిల్ రాజు పలువురు సినీ ప్రముఖులు మా సినిమా ట్రైలర్ వీక్షించి అభినందించడం మా కృషికి ఫలితం దక్కిందనిపిస్తుందన్నారు. రెగ్యులర్‌గా కాకుండా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో సినిమాను రూపొందిస్తున్నట్టు తెలిపారు. ప్రతి సీన్ ప్రేక్షకులను కట్టిపడేస్తుందని.. ట్రైలర్‌కు వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్‌పై ఆనందం ఉందన్నారు. ఏప్రిల్ 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యే మా సినిమాను ప్రతి ఒక్కరూ థియేటర్‌లో వీక్షించి సపోర్టు తెలపాలని కోరారు.