Ram Charan Peddi: ప్రచారం మొదలు పెట్టిన అచ్చియమ్మ..
‘దేవర’ (Devara) చిత్రంలోనూ లంగా ఓణీతో ఊర మాస్ గెటప్‌లో కనిపించింది. తాజాగా ‘పెద్ది’ (Peddi Heroine) నుంచి వచ్చిన లుక్ చూస్తుంటే ఈ చిత్రంలో కూడా జాన్వీ లంగా ఓణీతో.. సన్ గ్లాసెస్ పెట్టి కనిపించింది.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), బుచ్చిబాబు సాన (Butchibabu Sana) కాంబోలో వస్తున్న చిత్రం ‘పెద్ది’ (Peddi). ఈ చిత్రంలో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఆ మధ్యకాలంలో వచ్చిన గ్లింప్స్ (Peddi Glimpse) సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. గ్లింప్స్‌తో చరణ్‌కు సంబంధించిన లుక్ అయితే బయటకు వచ్చేసింది. మరీ ముఖ్యంగా చెర్రీ లుక్ ‘రంగస్థలం’ (Rangastalam) మూవీలో మాదిరిగా ఉండటం కూడా సినిమాపై అంచనాలు పెరగడానికి కారణమైంది. ఇక ఈ చిత్రం నుంచి తాజాగా జాన్వీ లుక్ వదిలారు మేకర్స్. అది చూసిన వారికి అసలు సినిమాపై జాన్వీ కేరెక్టర్ ఏమై ఉంటుందా? అన్న ఆసక్తి పెరిగింది.
జాన్వీకపూర్ (Janhvi Kapoor) అనగానే మనకు బాలీవుడ్ గ్లామర్ డాల్ గుర్తొస్తుంది. కానీ టాలీవుడ్ (Tollywood)కి వచ్చేసరికి జాన్వీ అచ్చ తెలుగు అమ్మాయిలా మారిపోతోంది. ‘దేవర’ (Devara) చిత్రంలోనూ లంగా ఓణీతో ఊర మాస్ గెటప్‌లో కనిపించింది. తాజాగా ‘పెద్ది’ (Peddi Heroine) నుంచి వచ్చిన లుక్ చూస్తుంటే ఈ చిత్రంలో కూడా జాన్వీ లంగా ఓణీతో.. సన్ గ్లాసెస్ పెట్టి కనిపించింది. ఈ చిత్రంలో జాన్వీ ‘అచ్చియమ్మ’గా అలరించనుంది. మొత్తానికి మరోసారి ఊర మాస్ గెటప్‌లో కనిపించనుందని తెలుస్తోంది. జీపుకి మైకులతో ఏదో పార్టీ ప్రచారం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఆమె వెనుక జీపులో కూర్చొన్న వారు ఏవో బ్యాడ్జీలు పెట్టుకుని ఉన్నారు. మొత్తానికి అచ్చియమ్మ ఏం ప్రచారం చేస్తోందో ఏమో మరి.
మొత్తానికి అచ్చియమ్మ క్యారెక్టర్ అయితే పవర్‌ఫుల్‌గానే ఉండేలా ఉంది. అందుకేనేమో మేకర్స్ సైతం ఆమె క్యారెక్టర్‌ను ‘పియర్స్ అండ్ పియర్‌లెస్’ అని పేర్కొన్నారు. చెర్రీ, జాన్వీల క్యారెక్టర్స్, ఆ వాతావరణం చూస్తుంటే పల్లెటూరి నేపథ్యంలో సినిమా తెరకెక్కుతోందనడంలో సందేహం లేదు. జాన్వీ లుక్ చూసినా.. రామ్ చరణ్ గెటప్ చూసినా ‘రంగస్థలం’ (Rangastalam) షేడ్స్ అయితే గట్టిగానే కొడుతున్నాయి. కథ పూర్తిగా భిన్నమైనది అయ్యుండొచ్చు కానీ సినిమా ఆ రేంజ్ హిట్ ఇస్తుందన్న ఫీల్ అయితే కలుగుతోంది. మొత్తానికి అచ్చియమ్మ అయితే ప్రచారం మొదలు పెట్టేసింది. ఈ సినిమా మంచి సక్సెస్ సాధించిందంటే.. జాన్వీ కెరీర్ (Janhvi Career)కు బీభత్సమైన హైప్ వస్తుందనడంలో సందేహం లేదు. చెర్రీ కూడా మంచి బూస్ట్ ఇస్తుందని అనిపిస్తోంది. ఇక చూడాలి ఏం జరుగుతుందో..
ప్రజావాణి చీదిరాల