ఏంటి.. ఇద్దరూ ఇంత షాకిచ్చారు?
మన రౌడీ హీరో విజయ్ దేవరకొండ మామూలు దొంగ కాదు.. నిన్న మొన్నటి వరకూ సోలో ఫోటోలు షేర్ చేస్తుంటే అమెరికాకు ఒక్కడే వెళ్లాడేమో అనుకున్నాం.

మన రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Rowdy Hero Vijay Devarakonda) మామూలు దొంగ కాదు.. నిన్న మొన్నటి వరకూ సోలో ఫోటోలు షేర్ చేస్తుంటే అమెరికా (America)కు ఒక్కడే వెళ్లాడేమో అనుకున్నాం. సీన్ కట్ చేస్తే స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా (Rashmika Mandanna)తో కలిసి అక్కడ సందడి చేశాడు. అమెరికాలోని న్యూయార్క్ (Newyork)లో వరల్డ్ లార్జెస్ట్ ఇండియా డే కవాతు జరిగిన విషయం తెలిసిందే. ఈ కవాతుకు రెండు రోజుల ముందే విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) న్యూయార్క్‌కు చేరుకున్నాడు. అక్కడ రకరకాల ప్లేస్‌ల్లో తీసుకున్న ఫోటోలను షేర్ చేశాడు. అవి చూసిన వారంతా విజయ్ ఒక్కడే హాజరయ్యాడని అనుకున్నారు. కట్ చేస్తే తాజాగా రష్మికతో కలిసి ఇండియా డే కవాతులో పాల్గొన్న ఫోటోలు బయటకు వచ్చాయి.
భారతదేశ 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని (Independence Day) పురస్కరించుకొని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో ఈ వరల్డ్ లార్జెస్ట్ ఇండియా డే పరేడ్ జరిగింది. ఈ పరేడ్‌లో విజయ్ దేవరకొండ, రష్మికలే స్పెషల్ అట్రాక్షన్. చేయి చేయి పట్టుకుని నడుస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో వాటిని చూసిన నెటజన్లు ఫుల్ ఖుష్ అవుతున్నారు. అసలే ఇద్దరికీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. వీరిద్దరూ జంటగా కనిపిస్తే చూడాలనుకునేవారు కూడా ఎక్కువే. ఈ ఫోటోలను చూసిన ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవు. నెట్టింట తెగ షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు. వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారంటూ చాలా కాలంగా వార్తలు వినవస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఇద్దరూ తమ కెరీర్ పరంగా బిజీ అవడం మూలానో.. మరో కారణమో కానీ ఈ మధ్య కాలంలో కలిసి కనిపించిందే లేదు. ఈ నేపథ్యంలో మరోసారి న్యూయార్క్ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
‘గీత గోవిందం (Geetha Govindam)’ సినిమాతో సూపర్ హిట్ పెయిర్‌గా నిలిచిన వీరిద్దరూ ‘డియర్ కామ్రేడ్ (Dear Comrade)’లో కలిసి అలరించారు ఆ తరువాత నుంచి ఇద్దరూ స్క్రీన్ షేర్ చేసుకున్నదే లేదు. ఇన్నాళ్లకు ఆ తరుణం కూడా కలిసి రానుంది. ప్రస్తుతం రాహుల్ సంకృత్యాన్ (Rahul Sankrutyan) దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ రూపొందిస్తున్న చిత్రంలో విజయ్ దేవరకొండ, రష్మికలు జంటగా నటించనున్నట్టు టాక్. ఈ సినిమా పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందనుంది. ‘డియర్ కామ్రేడ్’ తర్వాత ఈ జంట.. స్క్రీన్ షేర్ చేసుకున్నదైతే లేదు కానీ ఒకరి సినిమాలను మరొకరు మాత్రం ప్రమోట్ చేస్తూ ఉంటారు. సినిమా విడుదల అవుతోందంటే శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఉంటారు.
ప్రజావాణి చీదిరాల