Entertainment

The Rajasaab: మరో ట్రైలర్ రిలీజ్.. ఇది చూశాక ఫ్యాన్స్ ఏమంటారో..

3 నిమిషాల 12 సెకన్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్ ఆసక్తికరంగానూ.. ప్రభాస్ డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. గతంలో రిలీజైన ట్రైలర్‌.. ప్రస్తుత ట్రైలర్‌కు మధ్య వ్యత్యాసం చాలా ఉంది.

The Rajasaab: మరో ట్రైలర్ రిలీజ్.. ఇది చూశాక ఫ్యాన్స్ ఏమంటారో..

ప్రభాస్ (Prabhas), మారుతి (DirectorMaruthi) కాంబోలో రూపొందిన‘ది రాజాసాబ్‌’ (The RajaSaab) విడుదలకు సమయం దగ్గరపడుతోంది. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌ను పీక్స్‌కు తీసుకెళుతోంది. ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ను వదులుతూ అంచనాలను పెంచేస్తోంది. ఇప్పటికే ట్రైలర్‌తో అంచనాలను పెంచేసిన చిత్రయూనిట్.. తాజాగా మరో ట్రైలర్‌ (The RajaSaab Trailer 2.O)ను విడుదల చేసింది. హారర్ ఫాంటసీ థ్రిల్లర్‌లో నిధి అగర్వాల్‌ (Nidhi Agerwal), మాళవికా మోహనన్‌ (Malavika Mohanan), రిద్ధి కుమార్‌ (Ridhi Kumar) హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం 2026 జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక తాజాగా విడుదల చేసిన ట్రైలర్ రెబల్ స్టార్ ఫ్యాన్స్‌ని విపరీతంగా ఆకట్టుకుంటోంది.

3 నిమిషాల 12 సెకన్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్ ఆసక్తికరంగానూ.. ప్రభాస్ డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. గతంలో రిలీజైన ట్రైలర్‌.. ప్రస్తుత ట్రైలర్‌కు మధ్య వ్యత్యాసం చాలా ఉంది. ప్రభాస్ అయితే చాలా కాలం తర్వాత చాలా జోష్‌గా సరికొత్తగా ఈ చిత్రంలో కనిపిస్తున్నాడు. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఒక ముఖ్య పాత్రలో మెప్పించనున్నారు. మొత్తానికి ప్రేక్షకుల అటెన్షన్‌ను గ్రాబ్ చేయడంలో ‘రాజాసాబ్’ అయితే ముందున్నాడనడంలో సందేహమే లేదు. గత ట్రైలర్ చూసిన నెటిజన్లు రూ. 1000 కోట్ల బొమ్మ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ ట్రైలర్ చూశాక ఇంకేమంటారో చూడాలి. ఈసారి సంక్రాంతి రచ్చ రంబోలానే. హేమాహేమీలంతా సంక్రాంతి బరిలోనే నిలుస్తున్నారు. ఒకవైపు ‘ది రాజాసాబ్’.. మరోవైపు ‘మన శంకర వరప్రసాద్’ సందడి చేయనుండగా.. శర్వానంద్ (Sarvanand).. ‘నారీ నారీ నడుమ మురారీ’ (Nari Nari Naduma Murari).. నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) ‘అనగనగా ఒక రాజు’ చిత్రాలకు తోడు.. తమిళ స్టార్ విజయ్ (Vijay) చివరి చిత్రం ‘జయ నాయగన్’ కూడా విడుదల కానుంది.

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
December 29, 2025 11:35 AM