కోట ఇంట మరో విషాదం.. ఆయన సతీమణి మృతి
లెజెండరీ నటుడు కోట శ్రీనివాసరావు మరణించి నెల రోజులు కూడా కాకమునుపే ఆయన ఇంట మరో విషాదం చోటుచేసుకుంది. కోట శ్రీనవాసరావు సతీమణి రుక్మిణి (75) ఇవాళ (సోమవారం) మృతి చెందారు.

లెజెండరీ నటుడు కోట శ్రీనివాసరావు (Kota Srirnivasa rao) మరణించి నెల రోజులు కూడా కాకమునుపే ఆయన ఇంట మరో విషాదం చోటుచేసుకుంది. కోట శ్రీనవాసరావు సతీమణి రుక్మిణి (Kota Srinivasa Rao Wife) (75) ఇవాళ (సోమవారం) మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆమె నేడు తుదిశ్వాస విడిచారు. కోట శ్రీనివాసరావు జులై 13న మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన లేరన్న వార్త రుక్మిణిని మరింత కృంగదీసినట్టుగా తెలుస్తోంది. నెల రోజుల వ్యవధిలో కోట శ్రీనివాసరావు దంపతులు మృతి చెందడం.. కుటుంబ సభ్యులను కలచివేస్తోంది. కోటా శ్రీనివాసరావు దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు కాగా.. కుమారుడు ఆంజనేయ ప్రసాద్.. 2010లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు.