కృష్ణాష్టమి సందర్భంగా ‘శ్రీ కృష్ణ అవతార్ ఇన్ మహోబా’ అనౌన్స్‌మెంట్
మరి శ్రీకృష్ణుడి గురించి సినిమా అంటే ఎలా? ఆయన కథ ఒక్క సినిమాతో అయిపోయేదా? ఆయన లీలల గురించి చెబుతూ పోతే ఎన్ని చిత్రాలు తీయాలి? మరి ఈ సినిమాను ఏ అంశం ఆధారంగా రూపొందిస్తున్నారంటారా?

రేపు (శనివారం) కృష్ణాష్టమి (Krishnastami). దీనికి ఒకరోజు ముందు అంటే శుక్రవారం నాడు 'అభయ్ చరణ్ ఫౌండేషన్', 'శ్రీజీ ఎంటర్‌టైన్‌మెంట్' సంయుక్తంగా ఒక చారిత్రక మహాకావ్యానికి శ్రీకారం చుట్టారు. దీనికి సంబంధించిన ఒక ఆసక్తికర టైటిల్‌ను నేడు ప్రకటించారు. అనిల్ వ్యాస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘శ్రీ కృష్ణ అవతార్ ఇన్ మహోబా’ టైటిల్‌ను పెట్టారు. ముకుంద్ పాండే దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రానికి ఢిల్లీకి చెందిన ఇస్కాన్ (ISCON) సీనియర్ ప్రీచర్ ‘జితామిత్ర ప్రభు శ్రీ’ ఆశీస్సులు కూడా దక్కాయి. ఇస్కాన్ ఆశీస్సులు కూడా ఈ చిత్రానికి ఉన్నాయంటే.. మొత్తానికి మేకర్స్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
మరి శ్రీకృష్ణుడి గురించి సినిమా అంటే ఎలా? ఆయన కథ ఒక్క సినిమాతో అయిపోయేదా? ఆయన లీలల గురించి చెబుతూ పోతే ఎన్ని చిత్రాలు తీయాలి? మరి ఈ సినిమాను ఏ అంశం ఆధారంగా రూపొందిస్తున్నారంటారా? అదే మరిందత ఆసక్తికరం. చలన చిత్ర పరిశ్రమలోనే శ్రీకృష్ణ భగవానుడిని వినూత్నంగా ఈ చిత్ర యూనిట్ చూపించనుంది. దివ్యత్వాన్ని, ధీరత్వాన్ని, ఆధ్యాత్మిక ప్రభావాన్ని చూపిస్తూనే.. ఒక యుద్ధ వీరుడిగానూ తెరకెక్కించనున్నారు. అలాగే 11-12వ శతాబ్దాల నాటి 'మహోబా' సాంస్కృతిక వైభవాన్ని సైతం చూపించనున్నారు. ప్రపంచ స్థాయి టెక్నీషియన్లను వినియోగించుకుని ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ చిత్రంగా రూపొందించనున్నారు. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను మేకర్స్ త్వరలోనే ప్రకటించనున్నారు.
ప్రజావాణి చీదిరాల