Anil Ravipudi: చిరుని సైడ్ చేసి కల్యాణ్‌రామ్‌ని లైన్‌లో పెట్టిన అనిల్ రావిపూడి
సంక్రాంతి పండుగ అంటే సినిమాల పరంగా చూస్తే ప్రస్తుతం మనకు అనిల్ రావిపూడి కనిపిస్తున్నారు. రెండేళ్లుగా సంక్రాంతిని అనిల్ రావిపూడి తన ఖాతాలో వేసుకుంటున్నారు.
సంక్రాంతి పండుగ అంటే సినిమాల పరంగా చూస్తే ప్రస్తుతం మనకు అనిల్ రావిపూడి కనిపిస్తున్నారు. రెండేళ్లుగా సంక్రాంతిని అనిల్ రావిపూడి తన ఖాతాలో వేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే వచ్చే సంక్రాంతికి ఆయన ఎవరితో సినిమా తీయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. అయితే గతంలో ఒకసారి అంటే ‘మన శంకరవరప్రసాద్ గారు’ ప్రమోషన్స్ సమయంలో మెగాస్టార్ చిరంజీవి.. తను, విక్టరీ వెంకటేష్ కలిసి మల్టీస్టారర్ చేయాలని ఉందంటూ తన మనసులో మాటను బయటపెట్టేశారు. ఆ సమయంలోనే అనిల్ రావిపూడి సైతం చిరు, వెంకీల కోసం తనే కథను తయారు చేస్తానని కూడా చెప్పారు. దీంతో ఈసారి సంక్రాంతికి ఇద్దరితో వస్తారేమో అనుకున్నాం.
తాజాగా అనిల్ రావిపూడి తన సినిమాను ప్రకటించేశారు. మల్టీస్టారరే ప్రకటించారు కానీ అందులో చిరు లేరు. తన ప్రస్థానానికి కారణమైన హీరో నందమూరి కల్యాణ్‌రామ్, అలాగే మొదటి వంద కోట్ల బొమ్మ కొట్టిన హీరో వెంకీతో సినిమాను తీయబోతున్నట్టు అనిల్ రావిపూడి ప్రకటించారు. సంక్రాంతికి రానున్నట్టు సైతం వెల్లడించారు. ఇప్పటి వరకూ చేయని కథాంశంతో సినిమా ఉంటుందని ముందుగానే చెప్పి అంచనాలను పెంచేశారు అనిల్ రావిపూడి. పైగా ఎవరూ ఊహించని మల్టీస్టారర్ ఇది. మొత్తానికి అనిల్ రావిపూడి వచ్చే సంక్రాంతికి చిరుని సైడ్ చేసి వెంకీ, కల్యాణ్‌రామ్‌లతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అంతా బాగానే ఉంది కానీ ఇప్పటి వరకూ చేయని కథాంశం అంటున్నారు.. మరి కామెడీ ఎంటర్‌టైనరేనా? లేదంటే మరేదైనా కాన్సెప్ట్‌తో వస్తారా? చూడాలి.