Anasuya: వాళ్లంతా కేవలం నటులేనంటూ అనసూయ సంచలన కామెంట్స్
సోషల్ మీడియాలో ఎన్ని విమర్శలొచ్చినా.. ఎంత ట్రోలింగ్ జరిగినా ఏమాత్రం పట్టించుకోకుండా తను షేర్ చేయాలనుకున్న పిక్స్ షేర్ చేస్తూ.. పెట్టాలనుకున్న పోస్టులు పెడుతూనే ఉంటుంది యాంకర్ అనసూయ.
సోషల్ మీడియాలో ఎన్ని విమర్శలొచ్చినా.. ఎంత ట్రోలింగ్ జరిగినా ఏమాత్రం పట్టించుకోకుండా తను షేర్ చేయాలనుకున్న పిక్స్ షేర్ చేస్తూ.. పెట్టాలనుకున్న పోస్టులు పెడుతూనే ఉంటుంది యాంకర్ అనసూయ. ముఖ్యంగా శివాజీ ఎపిసోడ్ తర్వాత మరింత రెచ్చిపోతోందని నెటిజన్లు అంటున్నారు. అనసూయకు వ్యతిరేకంగా ఆ తరువాత ఒక పెద్ద ఉద్యమమే నడిచింది. వేరొకరైతే సోషల్ మీడియా జోలికే వచ్చి ఉండేవారు కాదు. కానీ అనసూయ వాటన్నింటినీ పట్టించుకోకుండా యథావిధిగా తన పనులు తాను చేసుకుంటూ పోతోంది. అలాగే సోషల్ మీడియాలోనూ ఏమాత్రం జోష్ తగ్గించలే.
అయితే సీనియర్ నటి రాశిపై కూడా ఓ షోలో కామెంట్ చేసి అడ్డంగా దొరికిపోయింది. రాశి గారి ఫలాలు అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపై నటి రాశి స్పందించారు. పనిలో పనిగా నెటిజన్లంతా రాశికి అండగా నిలిచి.. అనసూయను ఏకిపారేశారు. చివరకు చేసేదేమీ లేక అనసూయ సారీ చెప్పింది. ఆ తరువాత ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ స్టోరీ పెట్టింది. ఎవరి పేరూ తీయకుండా.. హీరోయిన్ అంటూ స్టార్ట్ చేసింది. హీరోయిన్ తెరపై కాదు.. సత్యం మాట్లాడే ధైర్యం.. సొంత దారిలో నడిచే శక్తి.. సరైనదానికి నిలబడే గుండె ఉన్నవారే నిజమైన హీరోయిన్ అంటూ అనసూయ వ్యాఖ్యానించింది. మిగతా వాళ్లు కేవలం నటులేనని పేర్కొంది. ఇలా అనసూయ తన ఇన్ స్టా స్టోరీలో రాసుకురావడం హాట్ టాపిక్‌గా మారింది.
అసలు ఎవరి గురించి అనసూయ ఈ స్టోరీ పెట్టిందో అర్థం కావడం లేదు జనాలకు. అయితే రాశి గురించి చేసిన కామెంట్స్‌లో తనకు మూడేళ్ల క్రితం తెలుగు రాని తనంపై చేసిన స్కిట్‌లో డబుల్ మీనింగ్ డైలాగ్ చెప్పించారని అనసూయ తెలిపింది. అయితే దానిపై అప్పుడే డైరెక్ట్ చేసిన వ్యక్తి నిలదీయాల్సిందని.. కానీ తనకు ఆ టైంలో ఆ శక్తి లేకుండా పోయిందని చెప్పింది. తానిప్పుడు వెనక్కి వెళ్లి దానిని సరి చేయలేనని తెలిపింది. మహిళల భద్రత గురించి తాను గట్టిగా మాట్లాడుతుంటే తనపై నెగిటివ్ క్యాంపెయిన్ నడిపిస్తున్నారని అనసూయ వాపోయింది. ఆ కార్యక్రమానికి చెందిన దర్శక, నిర్మాతలు క్షమాపణ చెప్పినా చెప్పకున్నా.. తన విధి కాబట్టి తాను క్షమాపణ చెబుతున్నానని అనసూయ తెలిపింది. అంతా బాగానే ఉంది కానీ ఈ లేటెస్ట్ పోస్ట్ ఎవరి గురించో తెలియడం లేదు.