‘అమ్మా.. నాకు ఆ అబ్బాయి కావాలి’ ప్రారంభం.. నిర్మాతగా శైలజారెడ్డి ఎంట్రీ
సీనియర్ దర్శకుడు శివాల ప్రభాకర్ దర్శకత్వంలో "అమ్మా... నాకు ఆ అబ్బాయి కావాలి" చిత్రం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. జి.ఎస్.ఆర్. మూవీ మేకర్స్ పతాకంపై రూపొందుతోంది.
తెలుగు చిత్రసీమలో మహిళా నిర్మాతలు చాలా తక్కువ. ఇప్పుడిప్పుడే కొందరు మహిళలు నిర్మాతలుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. అలా నిర్మాతగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్న మహిళ జి. శైలజా రెడ్డి (G Sailaja Reddy). సీనియర్ దర్శకుడు శివాల ప్రభాకర్ దర్శకత్వంలో "అమ్మా... నాకు ఆ అబ్బాయి కావాలి" చిత్రం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. జి.ఎస్.ఆర్. మూవీ మేకర్స్ పతాకంపై రూపొందుతోంది. భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ చిత్రంతో పవన్ మహావీర్ (Pawan Mahaveer) హీరోగా పరిచయమవుతున్నాడు. శ్రీలక్ష్మి శైలజ (Srilakshmi Sailaja) సమర్పిస్తున్న ఈ చిత్రం సుహాన - మేఘశ్రీ హీరోయిన్లుగానూ.. సీనియర్ నటులు సుమన్ (Suman), రావు రమేష్ (Rao Ramesh) కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం హైదరాబాద్‌లోని సారధి స్టూడియోలో అత్యంత ఘనంగా జరిగింది. హీరోహీరోయిన్లపై ముహూర్తపు సన్నివేశాన్ని చిత్రీకరించారు. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ రచయిత వి.విజయేంద్రప్రసాద్ క్లాప్ కొట్టగా... నిర్మాతల మండలి అధ్యక్షులు కె.ఎల్.దామోదర్ ప్రసాద్, దర్శకుల సంఘం అధ్యక్షులు వీర శంకర్ గౌరవ దర్శకత్వం వహించగా.. సీనియర్ ఐపీఎస్ అధికారి ఘట్టమనేని శ్రీనివాస్ కెమెరా స్విచాన్ చేశారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు రేలంగి నరసింహారావు (Relangi Narasimha Rao), ప్రముఖ నిర్మాతలు తుమ్మలపల్లి రామసత్యనారాయణ, శోభారాణి, ప్రముఖ రచయిత జె.కె.భారవి తదితరులు హాజరయ్యారు.
ప్రజావాణి చీదిరాల