Katam Rayudu: కాటం క్రియేషన్స్‌కు అద్భుత స్పందన.. ఇదొక వ్యక్తి అలుపెరగని ప్రయాణం..
సినిమా అనేది ప్యాషన్. కానీ సినీ ప్రపంచంలోకి అడుగు పెట్టాలనే తపన ఉంటే సరిపోదు. హంగూ ఆర్భాటాలు కూడా ఉండాలి. ఇక్కడ ఉన్నత వర్గానికే పెద్ద పీట. లేదంటే విలువ ఉండదు.

సినిమా (movie) అనేది ప్యాషన్. కానీ సినీ ప్రపంచం (Cine World)లోకి అడుగు పెట్టాలనే తపన ఉంటే సరిపోదు. హంగూ ఆర్భాటాలు కూడా ఉండాలి. ఇక్కడ ఉన్నత వర్గానికే పెద్ద పీట. లేదంటే విలువ ఉండదు. ఇది వెండితెరకే కాదు.. బుల్లితెరకూ వర్తిస్తుంది. ఈ విషయాన్ని తెలుసుకున్న ఓ వ్యక్తి డబ్బు సంపాదించిన మీదటే తిరిగి తన కలను సాకారం చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. సాఫ్ట్‌వేర్ (Software) దిశగా అడుగులు వేసి సక్సెస్ సాధించి ఆపై రెండు స్టార్టప్ కంపెనీలను పెట్టారు. ఆ తరువాత తిరిగి తన కలను సాకారం చేసుకునేందుకు పయనమయ్యారు. అతని పేరే కాటం రాయుడు (Katam Rayudu).
పేరులోనే ఏదో వైబ్ ఉందనిపిస్తోంది కదా. ఇతను తన సినిమా కలను నెరవేర్చుకోవడం కోసం ఒక అలుపెరుగని ప్రయాణం చేశాడు. తొలుత కాటం రాయుడు సినిమాలపై ఆసక్తితో ముందు బుల్లితెరను ఎంచుకున్నారు. అక్కడి నుంచి వెండితెరపై వెలుగులు విరజిమ్మాలని భావించారు. ఈ క్రమంలోనే జబర్దస్త్ (Jabardast) షో జరుగుతున్న ప్రదేశాన్ని తెలుసుకుని అక్కడి గేటు బయట ఎన్నో రోజుల పాటు నిరీక్షించి చివరకు హైపర్ ఆది (Hyper Adi) టీంలో చోటు సంపాదించి కొన్ని స్కిట్స్‌లో భాగమయ్యారు. కానీ తనకు దక్కాల్సిన గౌరవం దక్కడం లేదని భావించి దానికి కారణం తన దగ్గర డబ్బు కానీ.. పలుకుబడి కానీ లేకపోవడమేనని తెలుసుకుని ఆ దిశగా కాటం రాయుడు అడుగులు వేశారు.
ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్ (Training Institute), బిజినెస్ వంటివి చేస్తూ రెండు సాఫ్ట్‌వేర్ స్టార్టప్ కంపెనీలను ప్రారంభించారు. అలా ఒక మంచి సక్సెస్ అయితే సాధించారు. ఆ తరువాత తిరిగి తన కలను సాకారం చేసుకునేందుకు ప్రయత్నం మొదలు పెట్టారు. కాటం క్రియేషన్స్ ప్రొడక్షన్స్‌ను ప్రారంభించి.. తనే నిర్మాతగా.. దర్శకుడిగా మారి ఒక సినిమాను రూపొందించాలని నిర్ణయించుకున్నారు. డివోషనల్ అండ్ ఎమోషన్ మిక్స్‌డ్ కథను ఎంచుకుని దాని కోసం ఈ నెల 6వ తేదీన ఆడిషన్స్ నిర్వహించారు. ఈ ఆడిషన్స్‌కు పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక నుంచి సైతం వచ్చి ఈ ఆడిషన్స్‌లో పాల్గొన్నారు. కొత్తవారినే ఎక్కువగా తీసుకోవాలనేది తన ఆకాంక్ష అని కాటం రాయుడు చెప్పారు. సినిమా త్వరలోనే ప్రారంభమవుతుందని వెల్లడించారు.
ప్రజావాణి చీదిరాల