Allu Sirish Marriage: తగ్గిన మెగా ఫ్యామిలీ సందడి..
అల్లు శిరీష్ పెళ్లి సంబరాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. అల్లు ఫ్యామిలీ మొత్తం పెళ్లి కార్యక్రమాల్లో సందడిగా గడుపుతోంది. పై ఫోటో చూశారా? అల్లు శిరీష్ పెళ్లి కొడుకును చేయడానికి సంబంధించిన ఫోటో అది. దానిని చూస్తే ఏమనిపిస్తోంది?
అల్లు శిరీష్ పెళ్లి సంబరాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. అల్లు ఫ్యామిలీ మొత్తం పెళ్లి కార్యక్రమాల్లో సందడిగా గడుపుతోంది. పై ఫోటో చూశారా?

అల్లు శిరీష్ పెళ్లి కొడుకును చేయడానికి సంబంధించిన ఫోటో అది. దానిని చూస్తే ఏమనిపిస్తోంది? మెగా ఫ్యామిలీ ఎక్కడ అనిపిస్తోంది కదా.

వాస్తవానికి గతంలో మాదిరిగా పరిస్థితులు ఉండి ఉంటే.. అల్లు శిరీష్ వెనుక మెగా ఫ్యామిలీ మొత్తం ఉండేది. కానీ ఇప్పుడు అయితే మెగా ఫ్యామిలీ సైతం గెస్టుల మాదిరిగానే ఈ వివాహానికి వస్తున్నట్టుగా కనిపిస్తోంది.

ఇప్పటికే అల్లు శిరీష్ వివాహ సంబరాలకు సంబంధించిన ఫోటోలు చాలా వచ్చాయి. కానీ ఆ ఫోటోల్లో మెగా ఫ్యామిలీ సందడి మాత్రం అంతంత మాత్రంగానే కనిపిస్తోంది.

అసలు గతంలో అయితే అల్లు ఫ్యామిలీ అని సెపరేట్‌గా చెప్పాల్సి వచ్చేది కాదు. మెగా ఫ్యామిలీలోనే అంతర్భాగంగా ఉండేది. అల్లు ఫ్యామిలీని కూడా మెగా ఫ్యామిలీగానే చెప్పేవారు.

ఎప్పుడైతే విభేదాలు వచ్చాయో అప్పటి నుంచి మెగా, అల్లు ఫ్యామిలీ అని సెపరేట్‌గా చెబుతూ వస్తున్నారు. మొత్తానికి మెగా ఫ్యామిలీ పెద్దగా సందడి చేయకపోవడంతో ఏదో లోటైతే కనిపిస్తోంది.

ఇక అల్లు శిరీష్ వివాహం కూడా కుటుంబ సభ్యులు, కొద్ది మంది బంధువులు, అతిథుల సమక్షంలోనే ఈ వివాహం జరుగనుంది. ఇక ఈ వివాహ సంబరాల్లో బాలకృష్ణ సతీమణి వసుంధర, నూతన దంపతులు విజయ్ దేవరకొండ, రష్మిక, రామ్ చరణ్, ఉపాసన, సాయి దుర్గా తేజ్, మెగా డాటర్ నిహారిక తదితరులు పాల్గొన్నారు.