Allu Arjun: ఒక రిప్లై అంట ఇవ్వొచ్చుగా..
ప్రపంచంలో ఎవ్వరూ క్షణం తీరిక లేనంత బిజీగా ఉండరు. ఒకవేళ బిజీగా ఉన్నారు అనుకున్నా.. తమ సోషల్ మీడియాను హ్యాండిల్ చేసేందుకు ఎవరో ఒకరిని నియమించుకుంటారు.

ప్రపంచంలో ఎవ్వరూ క్షణం తీరిక లేనంత బిజీగా ఉండరు. ఒకవేళ బిజీగా ఉన్నారు అనుకున్నా.. తమ సోషల్ మీడియాను హ్యాండిల్ చేసేందుకు ఎవరో ఒకరిని నియమించుకుంటారు. ముఖ్యంగా స్టార్ హీరోల విషయానికి వస్తే ఇది చాలా సహజం. మెయిన్‌టైన్ చేసేలా ఉంటేనే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. తమ ఫోటోలను షేర్ చేసినప్పుడు అభిమానులకు రిప్లై ఇవ్వడానికేం? ముఖ్యంగా వాళ్లంతగా తపిస్తుంటే..
తాజాగా ‘పుష్ప 2 (Pushpa 2)’ చిత్రానికి సైమా అవార్డుల పంట పండింది. బెస్ట్ యాక్టర్ (Best Actor)గా అల్లు అర్జున్ (Allu Arjun), బెస్ట్ డైరెక్టర్ (Best Director)గా సుకుమార్ (Sukumar), బెస్ట్ యాక్ట్రెస్ (Best Actress)గా రష్మిక మందన్నా (Rashmika Mandanna), బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ (Best Music Director)గా దేవిశ్రీ ప్రసాద్ (Devisri Prasad) అవార్డులను సొంంతం చేసుకున్నారు. దీనికి సంబంధించిన పిక్‌ను అల్లు అర్జున్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశాడు. దానిని చూసిన అభిమానులు నానా రచ్చ చేస్తున్నారు. ఫ్యాన్స్ అయితే బన్నీకి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెబుతున్నారు. కొందరు మాత్రం బన్నీకి యాంటీ కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరు మాత్రం నెక్ట్స్ సినిమా అప్‌డేట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నామంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్.. అట్లీ (Director Atlee)తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా 2027లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అప్పటి వరకూ ఆగలేమని ఈ లోపే ఒక చిత్రాన్ని వదలాలంటూ కొందరు అభిమానులు అర్థిస్తున్నారు.
గ్యాంగ్‌స్టర్ మూవీ చెయ్యొచ్చుగా..
మరికొందరు తమకు రిప్లై ఇవ్వాలని కోరుతున్నారు. మరి అల్లు అర్జున్ వీరి మెసేజ్‌ను చూస్తున్నాడా? అభిమానులకు ఆనందం కలిగించేలా ఒక రిప్లై అంట ఇవ్వొచ్చుగా.. అభిమానులు (Allu Arjun Fans) అంతగా అర్థించాలా? అంత బిజీగా ఉంటే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడమే మానేయవచ్చు కదా. ఆయన రిప్లై కోసం అభిమానులైతే కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఇకపోతే కనీసం #AA22 లుక్ అయినా షేర్ చేయాలని కోరుతున్నారు. అట్లీ (Director Atlee) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ముంబై (Mumbai)లో జరుగుతోంది. మరి దీనిని అయితే ఇప్పట్లో వదిలే అవకాశం అయితే లేదనే చెప్పాలి. అవార్డు వచ్చినందుకు ‘పార్టీ లేదా పుష్ప’ అని అడిగేవారూ లేకపోలేదు. అంతేకాకుండా ఒక గ్యాంగ్‌స్టర్ మూవీ (Gangster Movie) చేయాలని కూడా ఎక్స్ వేదికగా అభిమానులు కోరుతున్నారు. మరి ఇవన్నీ బన్నీ చూస్తున్నాడో లేదో.. అభిమానుల కోరికలు తీరుతాయోలేదో చూడాలి.
బ్లాక్ అండ్ వైట్‌లో పెట్టడమేంటి?
ఇదిలా ఉంటే.. యాంటీ కామెంట్స్ పెట్టే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ‘ఎన్ని అవార్డులు కొంటావ్ అన్న?’ అని ఓ నెటిజన్ ప్రశ్నిస్తే.. మరొకరు ‘వేసుకుందే బ్లాక్ సూట్.. మళ్లీ దానిని బ్లాక్ అండ్ వైట్‌లో పెట్టడమేంటి?’ అని ప్రశ్నిస్తున్నారు. ‘స్టైలిష్ స్టార్ అనే పదానికి బొడ్డు కోసి పేరు పెట్టింది వీడే ..’నంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టారు. ఇలా ఎవరి ఇష్టానికి వాళ్లు కామెంట్స్ పెడుతున్నారు. ప్రతి హీరోకు యాంటీ ఫ్యాన్స్ ఉంటారు అది సర్వసాధారణం. దీని గురించి పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు కానీ ఆరాధించే వారిని పట్టించుకోకపోవడం మాత్రం తప్పే అవుతుంది. అభిమానులను కొంచెం చూసుకోండి స్టార్స్.. వారు మీ నుంచి ఆశించేది చిన్న రిప్లైయేగా..
ప్రజావాణి చీదిరాల