Akhanda 2: సమయం చూసుకుని మరీ ‘అఖండ 2’ రిలీజ్ డేట్ వదిలిన మేకర్స్
అఖండ 2 ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ (Akhanda 2 Post Production Work) జరుపుకుంటోంది. అది కూడా దాదాపుగా ఎండింగ్‌కి చేరుకుంది. ఈ క్రమంలోనే సినిమా రిలీజ్ డేట్ (Akhanda 2 Release Date)ను మేకర్స్ ఒక పోస్టర్ ద్వారా అనౌన్స్ చేశారు.

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబోలో‘అఖండ 2’ (Akhanda 2) రూపొందుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘అఖండ’ (Akhanda) మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో దానికి సీక్వెల్‌గా ‘అఖండ 2’ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ (Akhanda 2 Post Production Work) జరుపుకుంటోంది. అది కూడా దాదాపుగా ఎండింగ్‌కి చేరుకుంది. ఈ క్రమంలోనే సినిమా రిలీజ్ డేట్ (Akhanda 2 Release Date)ను మేకర్స్ ఒక పోస్టర్ ద్వారా అనౌన్స్ చేశారు. ఆ పోస్టర్‌లో బాలయ్య పొడవైన జుట్టు, గుబురు గడ్డంతో మెడనిండా రుద్రాక్షలు.. చేతిలో త్రిశూలం ధరించి ఒక డివైన్ లుక్‌లో కనిపించారు. కాషాయం, గోధుమరంగు దుస్తులతో బాలయ్య చూడగానే ఒక ఆధ్యాత్మిక భావనను కలుగచేస్తున్నారు.
మొత్తానికి బాలయ్య (Balayya) అయితే ‘అఖండ 2’ మెస్మరైజ్ చేయడం ఖాయంగానే కనిపిస్తోంది. ఇక ఈ సినిమాను ఈ ఏడాది డిసెంబర్ 5న విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. బాలయ్య అభిమానులు (Balakrishna Fans) ఎంతగానో ఎదురు చూస్తున్న ‘అఖండ 2’ రిలీజ్ డేట్ అయితే ఫిక్స్ అయిపోయింది. ఇక బాలయ్య అభిమానులు ఎంత హడావుడి చేస్తారో చూడాలి. ‘అఖండ’ వంటి చిత్రాలకు బ్యాక్ గ్రౌండ్ (Akhanda BGM) స్కోరే ప్రధానం. మరి ఈ చిత్రానికి తమన్ బీజీఎం ఏ రేంజ్‌లో ఇచ్చారో చూడాలి. సినిమా విడుదలకు రెండు నెలల సమయం ఉండటంతో సినిమా ప్రమోషన్స్‌కి సైతం మంచి సమయం దొరికింది. మొత్తానికి మేకర్స్ (Akhanda 2 Makers) ప్రమోషన్స్‌కు సమయం చూసుకుని మరీ రిలీజ్ డేట్ వదిలారు. ఈ ప్రమోషన్స్ (Akhanda 2 Promotions)ను ఎలా ప్లాన్ చేస్తారో చూడాలి. ఇక ఈ చిత్రంలో సంయుక్త (Samyuktha) హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఆది పినిశెట్టి (Adi Pinisetty) ఓ పవర్‌ఫుల్ పాత్రలోనూ.. హర్షాలి మల్హోత్రా కీలక పాత్రలో నటిస్తున్నారు.
ప్రజావాణి చీదిరాల