Entertainment

Adivi Sesh: సక్సెస్‌కి కేరాఫ్ .. సింప్లిసిటీ కింగ్

సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి ఒక హిట్ పడిందంటే చాలు.. అసలు టైటిల్‌కి మరో కొసరు టైటిల్ యాడ్ అయిపోతుంది. ముఖ్యంగా హీరోల విషయంలో ఇది జరుగుతూ ఉంటుంది. చిరంజీవి (Chiranjeevi)కి మెగాస్టార్ (Megastar), రామ్ చరణ్‌ (RamCharan)కి అప్పట్లో మెగా పవర్ స్టార్ (MegaPowerStar)..

Adivi Sesh: సక్సెస్‌కి కేరాఫ్ .. సింప్లిసిటీ కింగ్

సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి ఒక హిట్ పడిందంటే చాలు.. అసలు టైటిల్‌కి మరో కొసరు టైటిల్ యాడ్ అయిపోతుంది. ముఖ్యంగా హీరోల విషయంలో ఇది జరుగుతూ ఉంటుంది. చిరంజీవి (Chiranjeevi)కి మెగాస్టార్ (Megastar), రామ్ చరణ్‌ (RamCharan)కి అప్పట్లో మెగా పవర్ స్టార్ (MegaPowerStar).. ఇప్పుడు గ్లోబల్ స్టార్ (GlobalStar).. అల్లు అర్జున్‌ (AlluArjun)కి అప్పట్లో స్టైలిష్ స్టార్.. ఇప్పుడు ఐకాన్ స్టార్ (IconStar).. ఎన్టీఆర్‌కు యంగ్ టైగర్ ఇలా దాదాపుగా ప్రతి ఒక్క హీరోకి సినీరంగంలో క్లిక్ అవగానే అడిషనల్ టైటిల్ వచ్చి చేరుతుంది. మరి అందరికీ ఉందా? అంటే.. లేదనే చెప్పాలి.

ఈ సినిమా వరకూ వద్దు..

సినీరంగంలో ఎందరో మహానుభావులు.. అందులో కొందరు మాత్రం సింప్లిసిటీకి బాస్‌లు. అందరికీ సాధ్యమయ్యేది కాదు.. సింపుల్‌గా తనకంటూ ఏ అడిషనల్ టైటిల్స్ ఇచ్చుకోకుండా కొందరు మాత్రమే హిట్స్ ఇస్తూ తమ పని తాము చేసుకుంటూ పోతుంటారు. ప్రస్తుతం మాస్ మహారాజ్ రవితేజ (Raviteja) నటించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కానుంది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్‌ (AshikaRanganath), డింపుల్‌ హయాతీ (Dimple Hayathi) హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుని ప్రమోషన్స్ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. తాజాగా చిత్ర యూనిట్ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ప్రెస్‌మీట్ నిర్వహించింది. దీనిలో భాగంగా కిషోర్ తిరుమల (Kishore Tirumala).. రవితేజకు సంబంధించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.

ప్రతిదీ ఆసక్తికరమే..

రవితేజ, తన అభిప్రాయాలు కలుస్తాయని.. తామిద్దరికీ ఎంటర్‌టైన్‌మెంట్ జోన్ అంటే ఇష్టమని తెలిపారు. తానెప్పుడూ కథ, అందులోని పాత్ర బట్టే సినిమాను ముందుకు తీసుకెళ్తానని వెల్లడించారు. అది నచ్చి ఈ సినిమా వరకూ మాస్‌ మహారాజ్‌ వద్దని.. కేవలం రవితేజ అని వేద్దామని తనకు రవితేజ చెప్పారని తెలిపారు. అసలు పేరు కంటే కొసరు పేరు మరింత పాపులర్ అయిపోతున్న తరుణమిది. అలాంటిది ఈ చిత్రం వరకూ మాస్ మహారాజ్ వద్దని రవితేజ చెప్పడం ఆసక్తికరం. రవితేజ కెరీర్ అనేది హిట్, ఫ్లాపుల సమ్మిళతం. కానీ ఇండస్ట్రీలో మరో హీరో ఉన్నాడు. ఆయనకు ఫ్లాప్ అంటే ఏమిటో తెలియదు. ఆయన సినిమాల కోసం అన్ని వర్గాల ప్రేక్షకులు ఎదురు చూస్తుంటారు. ఆయనే అడివి శేష్. సస్పెన్స్ థ్రిల్లర్స్ ఎక్కువగా చేసిన ఈ హీరో.. ఆ జానర్‌లో ఇంతవరకూ ఎవరూ చేయలేని చిత్రాలను చేశాడు. అడివి శేష్ విషయాన్ని వస్తే ప్రతిదీ ఆసక్తికరమే.

స్పెషల్ టైటిల్స్ లేవు..

అడివి శేష్‌కు ప్రత్యేకంగా అభిమానులంటూ లేరు కానీ అందరి హీరోల అభిమానులూ ఆయనను అభిమానిస్తారు. ఆయన సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఎందుకంటే ఆయన సినిమాలు సీట్ ఎడ్జ్‌న కూర్చోబెడతాయి. అన్ని చిత్రాలు మంచి సక్సెస్ సాధించాయి. హీరోగా ఒక్క సినిమా చేసి సక్సెస్ కొట్టిన వెంటనే కొసరు టైటిల్ యాడ్ చేసుకునే ప్రస్తుత తరుణంలో అడివి శేష్‌కు మాత్రం ఎలాంటి కొసరు టైటిల్స్ లేవు. ఇటీవల ఆయన నిర్వహించిన ‘డెకాయిట్’ ఈవెంట్ ఈ విషయమై విలేకరులు ఆయనను ప్రశ్నించగా.. తనకు తల్లిదండ్రులు అడవి శేష్ అనే టైటిల్ ఇచ్చారని.. దానికి మించిన టైటిల్ ఏది లేదని.. తనకు అక్కర్లేదని తెలిపాడు. ఆ ఒక్క మాటతో అడివి శేష్ ప్రతి ఒక్కరి మనసునూ దోచేశాడు. సక్సెస్‌ల మీద సక్సెస్ కొడుతున్నప్పటికీ కించిత్తు గర్వం లేదు. స్పెషల్ టైటిల్స్ లేవు.. ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ లేదు. ఇలాంటి హీరోలు చాలా అరుదుగా ఉంటారు. అడివి శేష్ వంటి హీరో ఉండటం టాలీవుడ్ చేసుకున్న పుణ్యమనే చెప్పాలి.

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
December 21, 2025 5:30 AM