Priya Marathe: సంచలనంగా నటి ప్రియ ఆకస్మిక మరణం
బుల్లి తెర నటి ప్రియా మరాఠే ఆకస్మిక మరణం పాలయ్యారు. టెలివిజన్ పరిశ్రమను నటి మరణం కుదిపేసింది. 38 ఏళ్ల ప్రియ పలు మరాఠీ, హిందీ భాషల్లో రెండు భాషల్లోనూ నటించి మెప్పించింది.

బుల్లి తెర నటి ప్రియా మరాఠే (Priya Marathe) ఆకస్మిక మరణం పాలయ్యారు. టెలివిజన్ పరిశ్రమ (Television Industry)ను నటి మరణం కుదిపేసింది. 38 ఏళ్ల ప్రియ పలు మరాఠీ, హిందీ భాషల్లో రెండు భాషల్లోనూ నటించి మెప్పించింది. ఎన్నో అద్భుతమైన పాత్రల్లో నటించి బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఇవాళ (ఆగస్ట్ 31)న ముంబైలోని మీరా రోడ్‌లోని తన నివాసంలో ప్రియా మరాఠే తుది శ్వాస విడిచింది. గత కొన్నేళ్లుగా ప్రియా మరాఠే క్యాన్సర్ (Cancer)తో పోరాడుతోంది. క్యాన్సర్‌ను గుర్తించిన తొలినాళ్లలో ఆమె కోలుకున్నారు కానీ వ్యాధి తిరగబెట్టడంతో శరీరమంతా వ్యాపించింది. దీంతో చికిత్సకు సైతం ఆమె శరీరం స్పందించడం మానేసింది. ఈ క్రమంంలోనే ప్రియా మరాతే (Priya Marathe died with cancer) అకాల మరణం పాలయ్యారు.
ప్రియా మరాతే చాలా చిన్న వయసులో నటిగా బుల్లితెరకు పరిచయమైంది. ఆమె యా సుఖనోయ, చార్ దివాస్ ససుచే వంటి మరాఠీ సీరియల్స్ (Serials)తో తన టెలివిజన్ కెరీర్‌ను ప్రారంభించింది, త్వరగా తనను తాను ఒక ఆశాజనకమైన నటిగా స్థిరపరచుకుంది. ఏక్తా కపూర్ (Ektha Kapoor) ‘కసం సే’లో నటించడంతో ఆమె బాగా ఫేమస్ అయిపోయింది. కామెడీ సర్కస్ మొదటి సీజన్‌లో పాల్గొని హాస్య నటిగా సైతం ముద్ర వేసుకుంది. హిట్ సీరియల్ ‘పవిత్ర రిష్ట (Pavitra Rishta)’లో వర్ష సతీష్ పాత్రలో నటించి దేశ వ్యాప్తంగా ఆమె గుర్తింపు తెచ్చుకున్నారు. బడే అచ్చే లగ్తే హై (2012)లో జ్యోతి మల్హోత్రా పాత్రతో ప్రియా టెలివిజన్‌లో తిరుగులేని నటిగా ఎదిగింది. ‘తు తిథే మే, భాగే రే మాన్, జయస్తుతే, భారత్ కా వీర్ పుత్ర - మహారాణా ప్రతాప్ (Maharana Prathap)’ వంటి ప్రాజెక్టుల్లో నటించింది. పలు సినిమాల్లో సైతం ప్రియా మరాఠే నటించింది. హిందీ మూవీ ‘హమ్నే జీనా సీఖ్ లియా’లో నటించి మెప్పించింది. ఆ తరువాత కూడా పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రియా మరాఠే ఆకస్మిక మరణం అభిమానులను కలచివేస్తోంది.