Entertainment

Hero Suhas: గుడ్ న్యూస్ చెప్పిన నటుడు సుహాస్..

హీరో సుహాస్ ‘కలర్ ఫోటో’ చిత్రంతో మంచిపేరు తెచ్చుకున్నాడు. అప్పటి నుంచి వచ్చిన ప్రతి అవకాశాన్ని వదలకుండా చేస్తూనే ఉన్నాడు. ఇక సుహాస్ వ్యక్తిగత జీవితానికి వస్తే తాజాగా మరోసారి తండ్రి అయ్యాడు.

Hero Suhas: గుడ్ న్యూస్ చెప్పిన నటుడు సుహాస్..

నటుడు సుహాస్ (Actor Suhas) గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. ‘కలర్ ఫోటో’ (Color Photo) చిత్రంతో మంచిపేరు తెచ్చుకున్నాడు. అప్పటి నుంచి వచ్చిన ప్రతి అవకాశాన్ని వదలకుండా చేస్తూనే ఉన్నాడు. ఇక సుహాస్ (Suhas) వ్యక్తిగత జీవితానికి వస్తే తాజాగా మరోసారి తండ్రి అయ్యాడు. సుహాస్ భార్య లలిత (Suhas Wife Lalitha) పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా (Social Media) వేదికగా వెల్లడించాడు. సుహాస్‌కు శుభాకాంక్షలు నెట్టింట వెల్లువెత్తుతున్నాయి. తొలుత షార్ట్ ఫిల్మ్స్‌తో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సుహాస్ లాక్‌డౌన్ (Lockdown) సమయంలో ఓటీటీ (OTT)లో విడుదలైన ‘కలర్ ఫోటో’ చిత్రంతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయాడు.

అక్కడి నుంచి అతనికి సినిమా అవకాశాలు వెదుక్కుంటూ వచ్చాయి. కమెడియన్ (Comedian), క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలన్ (Villain) ఇలా ఏ పాత్ర వచ్చినా వదలకుండా చేసి మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. గతేడాది జనవరిలో సుహాస్ దంపతులకు మగబిడ్డ (Baby Boy) జన్మించాడు. తిరిగి ఇప్పుడు కూడా మగబిడ్డ జన్మించాడు. సుహాస్, లలిత ఏడేళ్లపాటు ప్రేమించుకున్న మీదట.. ఇరువైపుల పెద్దలకు విషయం చెప్పారు. వారు అంగీకరించకపోవడంతో ఇంటి నుంచి వెళ్లిపోయి 2017లో వివాహం చేసుకున్నారు. అయితే సుహాస్ జీవితంలోకి లలిత వచ్చాక ఆయనకు బాగా కలిసొచ్చిందట. ఈ విషయాన్ని పలు ఇంటర్వ్యూలలో సుహాస్ తెలిపాడు. ప్రస్తుతం సుహాస్ తెలుగులో రెండు చిత్రాలు.. తమిళంలో ఓ చిత్రం చేస్తున్నాడు.

 

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
September 27, 2025 9:55 AM