Dasaradh Madhav: ‘కిల్లర్’పై నటుడు మాధవ్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్ అంటూ తమ ఫోటోలతో ఫిలిం స్టూడియోల చుట్టూ చెప్పులరిగేలా తిరిగే వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. మరోవైపు దానిని సాధించుకోవడం కోసం వేరే రంగంలోకి వెళ్లి తద్వారా అవకాశాలను వెదుక్కునేవారు కొందరు..
ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్ అంటూ తమ ఫోటోలతో ఫిలిం స్టూడియోల చుట్టూ చెప్పులరిగేలా తిరిగే వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. మరోవైపు దానిని సాధించుకోవడం కోసం వేరే రంగంలోకి వెళ్లి తద్వారా అవకాశాలను వెదుక్కునేవారు కొందరు.. ఏదైతేనైమి ఒక్క ఛాన్స్ పట్టాలి.. తానేంటో నిరూపించుకోవాలనే తపన. ఆ తపనకు ప్రాణం పోసి ఇండస్ట్రీకి ఎంతో ప్యాషన్‌తో వచ్చిన వ్యక్తి దశరధ్ మాధవ్. తనకంటూ పొలిటికల్‌గా మంచి గుర్తింపే ఉన్నా కూడా సినీరంగంపై మక్కువ ఆయనతో ఆ దిశగా అడుగులు వేయించింది. ఈ రంగంలోనే ఒకవైపు అవకాశాల కోసం వెదుక్కుంటూనే మరోవైపు లైన్ ప్రొడ్యూసర్‌గా కూడా రాణిస్తున్నారు. అలా ఆయనకు ‘కిల్లర్’ మూవీలో మంచి అవకాశం దక్కింది.
జ్యోతి పూర్వజ్, పూర్వజ్, మనీష్ గిలాడ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కిల్లర్’. సుక్కు పూర్వజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో చంద్రకాంత్ కొల్లు, విశాల్ రాజ్, అర్చన అనంత్, గౌతమ్ చక్రధర్ కొప్పిశెట్టి, దశరథ మాధవ్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి నేడు ఫైర్ అండ్ ఐస్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో దశరథ్ మాధవ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఈ చిత్రాన్ని డివైన్‌గా చేయడం జరిగిందని వెల్లడించారు. ఒక ప్యాషన్‌తో తానొక్కడే కాకుండా.. ప్రతీ డిపార్ట్‌మెంట్ ఎంతో కష్టపడి పని చేశారన్నారు. ముఖ్యంగా తనకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు పూర్వజ్ సుక్కుకి థ్యాంక్స్ చెప్పారు. ఒక పనిని ఇష్టపడి కష్టపడి చేస్తే నష్టమనేది ఉండదు అని నమ్మే వ్యక్తి సుక్కు అని మాధవ్ కొనియాడారు.
ఇక ‘కిల్లర్’ కోసం సుక్కు పూర్వజ్ గంటల తరబడి ఓపికగా కూర్చొని పని చేశారన్నారు. ఆ ప్రతిఫలమే కిల్లర్ మూవీ అని మాధవ్ తెలిపారు. ఇది ఒన్ మ్యాన్ షో అని.. ఈ సినిమా చూసిన తర్వాత జ్యోతి పూర్వజ్ గురించి కూడా అందరూ మాట్లాడుకుంటారన్నారు. ఈ మూవీ తరువాత జ్యోతి పూర్వజ్ పేరు చాలా గట్టిగా వినపడుతుందన్నారు. టెక్నాలజీని వాడుకుంటూ అన్ని క్రాఫ్ట్స్‌పైన ఒక మంచి అనుభవంతో తీసిన చిత్రమే కిల్లర్ అని పేర్కొన్నారు. తాను ఈ చిత్రంలో జ్యోతి పూర్వజ్‌కు తమ్ముడి పాత్రలో కనిపిస్తానని వెల్లడించారు. తామిద్దరి మధ్య ఒక ఎమోషనల్ బాండింగ్ ఉందని తెలిపారు. ఈ మూవీ కోసం చాలా కష్టపడ్డామని... ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో పని చేశామని మాధవ్ తెలిపారు.
ప్రజావాణి చీదిరాల