Actor Lobo: బుల్లితెర నటుడు లోబోకు ఏడాది జైలు
బుల్లితెర నటుడు ఖయూమ్ అలియాస్ లోబోకు ఏడాది జైలు శిక్ష పడింది. 2018లో లోబో చేసిన ఓ ప్రమాదం కారణంగా ఇద్దరు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు.

బుల్లితెర నటుడు ఖయూమ్ అలియాస్ లోబోకు (Actor Lobo) ఏడాది జైలు శిక్ష (Jail Punishment to Lobo) పడింది. 2018లో లోబో చేసిన ఓ ప్రమాదం (Accident) కారణంగా ఇద్దరు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. ఈ కేసుకు సంబంధించిన తీర్పును తాజాగా జనగామ కోర్టు (Janagama Court) వెలువరించింది. లోబోకు ఏడాది పాటు జైలు శిక్ష విధించింది. అసలేం జరిగిందంటే.. 2018 మే 21న లోబో ఓ టీవీ ప్రోగ్రాం షూటింగ్ కోసం తెలంగాణ (Telangana)లోని రామప్ప (Ramappa), లక్నవరం, భద్రకాళి చెరువు (Bhadrakali Lake), వేయిస్తంభాల గుడి (1000 Pillors Temple) వంటి ప్రాంతాల్లో పర్యటించింది. షూటింగ్ (Shooting) పూర్తైన తరువాత లోబో స్వయంగా కారు నడుపుతూ వరంగల్ నుంచి హైదరాబాద్ (Hyderabad)కు బయలుదేరాడు. ఈ క్రమంలోనే కారు రఘునాథపల్లి మండలం నిడిగొండ వద్దకు రాగానే ఓ ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించగా పలువురికి గాయాలయ్యాయి.
ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఖిలాషాపురం గ్రామానికి చెందిన మేడె కుమార్, పెంబర్తి మణెమ్మలు మరణించాడు. ఇక కారును స్వయంగా నడుపుతున్న లోబోతో పాటు కారులోని వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రఘునాదపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి ఈ కేసు జనగామ కోర్టులో నడుస్తోంది. తాజాగా కోర్టు లోబోకు ఏడాది పాటు జైలు శిక్షను విధిస్తూ తీర్పును వెలువరించింది. అలాగే రూ.12,500 జరిమానా విధించింది. లోబో విషయానికి వస్తే డిఫరెంట్ స్టైల్‌తో బాగా పాపులర్ అయ్యాడు. టాటూ ఆర్టిస్టుగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన లోబో.. తర్వాత యాంకర్ (Anchor Lobo)గా మారాడు. డిఫరెంట్ డ్రెస్సింగ్ స్టైల్ (Dressing Style).. మేకప్ కారణంగా ఫేమస్ అయ్యాడు. ఆ తరువాత బిగ్‌బాస్ (Bigg Boss)లోనూ కంటెస్టెంట్‌గా వ్యవహరించాడు. వెండితెరపై కూడా లోబో కుమారి 21 ఎఫ్, పైసా, ప్రేమకథ వంటి చిత్రాల్లో నటించాడు.