నిశ్శబ్దానికి జీవం పోసిన నటుడు ఆది పినిశెట్టి
‘వి చిత్రమ్’గా తన సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టిన ఆది పినిశెట్టి ఇంత గొప్ప నటుడు అవుతాడని 2006లో ఎవరూ ఊహించలేదు. 2009లో వచ్చిన ఈరమ్తో చిత్రం ఆయనకు మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది.

‘వి చిత్రమ్ (V Chitram)’గా తన సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టిన ఆది పినిశెట్టి (Adi Pinisetty) ఇంత గొప్ప నటుడు అవుతాడని 2006లో ఎవరూ ఊహించలేదు. 2009లో వచ్చిన ఈరమ్తో చిత్రం ఆయనకు మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. అక్కడి నుంచి వరుస సినిమా అవకాశాలు ఆదిని వెదుక్కుంటూ వచ్చాయి. ‘సరైనోడు, నిన్ను కోరి (Ninnu Kori), రంగస్థలం (Rangastalam)’ వంటి చిత్రాలు ఆదికి ఎంతగానో గుర్తింపు తెచ్చి పెట్టాయి. హీరో, విలన్, సపోర్టింగ్ రోల్.. పాత్ర ఏదైతేనేమి సినిమాకు పేరు వచ్చినా రాకున్నా.. ఆయనకు మాత్రం మంచి పేరు వస్తుంది. తాజాగా ‘మయసభ’ దర్శకుడు దేవాకట్టా.. ఆది గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు తెలిపారు. ‘నిన్ను కోరి’లో ఆది నటన, డిక్షన్ అన్నీ దేవా కట్టాకు ఎంతగానో నచ్చాయట. అందుకే ‘మయసభ (Mayasabha)’ అనుకోగానే.. మొదట ఆయనకు ఆదియే గుర్తొచ్చాడట. ఇక అంతే తన ప్రాజెక్ట్ ‘మయసభ’లో లీడ్ రోల్ ఇచ్చేశారు.
ఆసక్తికర విషయం ఏంటంటే... ఇద్దరికి ‘మయసభ’లో లీడ్ రోల్స్ పోషించే అవకాశం ఉంది. వాటిలో ఆది ఒకటి ఎంచుకున్న మీదటే మరో పాత్రకు చైతన్యరావు (Chaitanya Rao)కు ఇచ్చారట. ఆ తరువాత ఆదితో పని చేయడం తనకు ఎంత ఆనందాన్నిచ్చిందో దేవా కట్టా (Deva Katta) తాజాగా ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. ‘మయసభ’లో కేఎల్ఎన్ పాత్ర ఎన్నో లిమిటేషన్స్.. లేయర్స్‌తో నిండిన ఛాలెంజింగ్ రోల్. అలాంటి పాత్రను ఎంతో అద్భుతంగా నటించాడు అనడం కన్నా జీవించాడు అనడం మేలేమో.. డైలాగ్స్ అంటే ఎవరైనా చెబుతారులే అనుకుందాం.. కానీ మాటల మధ్య నిశ్శబ్దం మాటేంటి? దానికి కూడా జీవాన్ని పోసిన నటుడు ఆది పినిశెట్టి. నత్తితో కూడిన పాత్ర కోసం ఎంత హోం వర్క్ చేశాడో కానీ ఒక అద్భుతంగా ఆ పాత్రను రక్తికట్టించాడు. అందుకే ఆ మయసభ వెబ్ సిరీస్ ఓటీటీని ఏలుతోంది.
ప్రజావాణి చీదిరాల