Peddi: ‘పెద్ది’లో ‘అబ్బనీ తియ్యనీ దెబ్బ’.. రామ్ చరణ్ ఏమన్నారంటే..
రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కిన చిత్రం ‘పెద్ది’. ఇది జాన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా దగ్గర పడుతుండటంతో దీనికి సంబంధించిన ఏదో ఒక వార్త నెట్టింట వైరల్ అవుతూనే ఉంది.
రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కిన చిత్రం ‘పెద్ది’. ఇది జాన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా దగ్గర పడుతుండటంతో దీనికి సంబంధించిన ఏదో ఒక వార్త నెట్టింట వైరల్ అవుతూనే ఉంది. తాజాగా ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’లోని సూపర్ హిట్ సాంగ్ ‘అబ్బనీ తియ్యనీ దెబ్బ’కు ఈ చిత్రంలో రామ్ చరణ్ స్టెప్పేలేయనున్నాడంటూ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. తాజాగా దీనిపై స్పందించిన రామ్ చరణ్.. ఆ పాటను రీక్రియేట్ చేయలేదని తెలిపారు. కొన్ని విషయాలను బిగ్‌స్క్రీన్‌పై చూసిన మీదటే తెలుసుకోవాలన్నారు. తాము ఆ పాటను రీక్రియేట్ చేయలేదని... కథకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చామన్నారు. అలాంటివన్నీ యాడ్ చేస్తే ఇది మరీ కమర్షియల్ సినిమా అవుతుందన్నారు. అదొక ఐకానిక్ సాంగ్ అని చరణ్ అన్నారు.
క్రీడలపై పూర్తి ఫోకస్‌తో ఉంటూ వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే వాళ్లు దీన్ని కచ్చితంగా చూడాలన్నారు. థియేటర్ నుంచి భావోద్వేగంతో బయటకు వస్తారని... ముఖ్యంగా వీక్ మైండ్ ఉన్నవాళ్లు కూడా చాలా స్ట్రాంగ్‌గా ఆలోచించడం ప్రారంభిస్తారన్నారు. జీవితంలో అత్యంత కష్టమైన సమయాలను ఎలా ఎదుర్కోవాలో అనే దానిపై స్పష్టమైన ఆలోచన వస్తుందన్నారు. మనకు ఎన్ని ఆటంకాలు ఎదురైనా జీవితం ముందుకు సాగిపోవాలి అని ‘పెద్ది’ మనకు నేర్పుతాడని రామ్ చరణ్ పేర్కొన్నారు. ఈ జనరేషన్ కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయమిదని రామ్ చరణ్ తెలిపారు. తన తండ్రి చిరంజీవిని చూసి తానెంతో స్ఫూర్తి పొందానని.. ఆయన లేకుంటే తన జీవితమే లేదని తెలిపారు. బాబాయ్ పవన్ కల్యాణ్‌ను చూసి ఎన్నో విషయాలు నేర్చుకున్నట్లు తెలిపారు. రాజకీయాల్లోకి వచ్చినప్పుడు జీరోతో మొదలుపెట్టి.. ఇప్పుడు డిప్యూటీ సీఎం స్థాయికి చేరుకున్నారని రామ్ చరణ్ పేర్కొన్నారు.