Committee Kurrollu: బాక్సాఫీస్‌ను రఫ్ఫాడిన చిన్న సినిమా.. అవార్డుల్లోనూ కింగే..
చిన్న సినిమా అనగానే ఒక చిన్న చూపు అయితే ఉంటుంది. ముఖ్యంగా మన తెలుగు వారికి భారీ బడ్జెట్ ఉండాలి.. అద్దాల మేడలు.. కోటలు.. స్టంట్స్.. వివిధ దేశాలు చుట్టొచ్చి చేసే సాంగ్స్ ఉంటేనే ఆనుతుంది. లేదంటే లైట్ అనేస్తారు.

చిన్న సినిమా (Small Movie).. అనగానే ఒక చిన్న చూపు అయితే ఉంటుంది. ముఖ్యంగా మన తెలుగు వారికి భారీ బడ్జెట్ ఉండాలి.. అద్దాల మేడలు.. కోటలు.. స్టంట్స్.. వివిధ దేశాలు చుట్టొచ్చి చేసే సాంగ్స్ ఉంటేనే ఆనుతుంది. లేదంటే లైట్ అనేస్తారు. థియేటర్ (Movie Theater) వైపే చూడరు. కానీ చిన్న సినిమాలను అంత తక్కువగా చూడాల్సిన అవసరం లేదని కొన్ని ప్రూవ్ చేశాయి. వాటిలో ‘కమిటీ కుర్కోళ్లు (Committee Kurrollu)’ ఒకటి. రూ.9 కోట్లతో రూపొందిన ఈ చిత్రం రెట్టింపునకు పైనే అంటే రూ.18.5 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఇక నాన్ థియేట్రికల్ (Non Theatrical)గా రూ.6 కోట్లు వసూళ్లలో మొత్తంగా రూ.24.5 కోట్లను ఈ చిత్రం తన ఖాతాలో వేసుకుంది. ఇంతటితో ఆగిందా? అవార్డులను సైతం కొల్లగొడుతోంది.
యధు వంశీ (Director Yadu Vamsi) దర్శకత్వంలో రూపొందిన ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రం విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంది. ఈ సినిమా తీసే సమయంలో మేకర్స్‌కు తమ సినిమాపై కాన్ఫిడెన్స్ ఉండి ఉండొచ్చేమో అంత పెద్ద సౌండ్ చేస్తుందని ఎవరూ ఊహించలేదు. విడుదలైన తర్వాత కానీ సినిమా సత్తా తెలియలేదు. నిహారిక కొణిదెల (Niharika Konidela) నటిగా, నిర్మాతగా ఈ చిత్రంతో అవార్డులు అందుకుంటూనే ఉంది. కొద్ది రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డుల్లో (Gaddar Awards) సత్తా చాటిన ఈ చిత్రం .. రీసెంట్‌గా గామా అవార్డుల (GAMA Awards)ను సైతం గెలుచుకుంది. జాతీయ సమైక్యత, మత సామరస్యం, అణగారిన వర్గాల సామాజిక అభ్యున్నతిపై తీసిన ఉత్తమ ఫీచర్ ఫిల్మ్‌గా, యధు వంశీకి ఉత్తమ తొలి దర్శకుడిగా అవార్డులు వచ్చాయి. ఇక గామా విషయానికి వస్తే.. బెస్ట్ డెబ్యూ ప్రొడ్యూసర్ (Best Debute Producer)గా నిహారిక కొణిదెలకు, బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ (Best Debute Director)గా యదు వంశీకి అవార్డులు వచ్చాయి.
ఇంతటితో ఈ చిత్రం ఆగిందా? సైమా (SIIMA Awards)లోనూ మెరిసింది. మా 2025 వేడుకల్లో బెస్ట్ డెబ్యూ ప్రొడ్యూసర్‌గా నిహారిక కొణిదెలకు, బెస్ట్ డెబ్యూ యాక్టర్గా సందీప్ సరోజ్‌కి అవార్డులు వచ్చాయి. మొత్తానికి నిర్మాతగా తన తొలి చిత్రంతోనే నిహారిక అవార్డుల మీద అవార్డులు గెలుచుకుంటోంది. మొత్తానికి బాక్సాఫీస్‌ను రఫ్ఫాడిన ఈ చిన్న చిత్రం.. అవార్డుల్లోనూ కింగ్ అనిపించుకుంటోంది. ఈ చిత్రం గతేడాది ఆగస్ట్ 9న విడుదలై మంచి సక్సెస్ సాధించింది.
ప్రజావాణి చీదిరాల