Movie News: రూ.2 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన చిన్న సినిమా.. రూ.33 కోట్లు కొల్లగొట్టింది..
అందుకే చిన్న సినిమాను చిన్న చూపు చూడొద్దనేది.. చిన్న సినిమానా.. పెద్ద సినిమానా అనేది కాదన్నయ్యా కావల్సింది.. కంటెంట్ ముఖ్యం బిగిలూ.. దర్శకనిర్మాతలు గురి చూసి కొట్టారు.. కోట్లు కొల్లగొట్టారు.

అందుకే చిన్న సినిమాను చిన్న చూపు చూడొద్దనేది.. చిన్న సినిమానా.. పెద్ద సినిమానా అనేది కాదన్నయ్యా కావల్సింది.. కంటెంట్ ముఖ్యం బిగిలూ.. దర్శకనిర్మాతలు గురి చూసి కొట్టారు.. కోట్లు కొల్లగొట్టారు. ఎక్కడ రూ.2 కోట్ల బడ్జెట్? ఎక్కడ రూ.33 కోట్లు? పొంతన ఉందా ఏమైనా..? అది కూడా పెద్ద సినిమాలతో పాటు విడుదలైన ఓ చిన్న చిత్రం వాటిని డామినేట్ చేసి పడేసింది. ఇంతకీ ఆ సినిమా ఏంటంటారా? లిటిల్ హార్ట్స్..
లిటిల్ హార్ట్స్ (Little Hearts) అంటే చిన్ని హృదయాలు.. చూశారా.. సినిమా పేరులోనూ చిన్న ఉంది.. బడ్జెట్ పరంగా.. హీరోహీరోయిన్ల పరంగా ఎటు చూసినా ఇది చిన్న సినిమానే. కానీ పెద్దలెందరి హృదయాలనో కొల్లగొట్టింది. నవ్వించింది.. ఎమోషనల్ అయ్యేలా చేసింది. చివరికి కోట్లు కొల్లగొట్టింది. మౌళి తనూజ్ (Mouli Tanuj).. ‘90స్ (90S Webseries)’ అనే వెబ్ సిరీస్‌తో ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ తరువాత ‘లిటిల్ హార్ట్స్’ మూవీతో వెండితెరపై మెరిశాడు. ఈ సినిమాలో శివానీ నాగరం (Sivani Nagaram) హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రాన్ని ఆదిత్య హాసన్ (Producer Aditya Haasan) నిర్మాతగా.. సాయి మార్తాండ్ (Sai Marthand) రూపొందించారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కూడా భారీగానే నిర్వహించారు. మొత్తానికి చిన్న సినిమాను జనాల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు.
ఆ తరువాత సినిమాకు వచ్చిన మౌత్ టాక్ (Mouth Talk) కూడా గట్టిగానే పని చేసింది. అంతే సినిమా విడుదలైన పది రోజుల్లో దాదాపు రూ.33 కోట్లు కచ్చితంగా చెప్పాలంటే రూ.32.15 కోట్ల రూపాయల వసూళ్లను ప్రపంచ వ్యాప్తంగా దక్కించుకుంది. ఈ సినిమా విడుదలైన సమయంలోనే అనుష్క (Anushka Shetty) నటించిన ‘ఘాటీ’ (Ghati Movie).. శివ కార్తికేయన్ (Siva Karthikeyan) నటించిన ‘మదరాసి’ (Madarasi) చిత్రాలు సైతం విడుదలయ్యాయి. అయినా సరే ఈ చిత్రం వాటిని దాటుకుని సగర్వంగా నిలిచింది. అంతెందుకు గత వారం మిరాయ్ (Mirai), కిష్కిందపురి (Kishkindapuri) వంటి చిత్రాలు విడుదలైనా కూడా ఈ చిత్రమే ఇప్పటికీ టాక్ ఆఫ్ ది టౌన్. ఈ చిత్రానికి రాజీవ్ కనకాల (Rajeev Kanakala), అనిత చౌదరి (Anitha Chowdary), సత్యకృష్ణన్ (Satya Krishnan) స్పెషల్ అట్రాక్షన్.
ప్రజావాణి చీదిరాల