Entertainment

A Masterpiece: త్రేతాయుగం, ద్వాపర, కలియుగాలను మిక్స్ చేసిన చిత్రమిది..

రామాయణంలో సూపర్ మ్యాన్ ఎవరంటే తడుముకోకుండా హనుమంతుడని చెప్పేస్తారు. కష్టం ఎక్కడుంటే అక్కడకు రయ్‌మంటూ ఎగురుకుంటూ వెళ్లిపోయి అక్కడ వాలిపోతాడు.

A Masterpiece: త్రేతాయుగం, ద్వాపర, కలియుగాలను మిక్స్ చేసిన చిత్రమిది..

రామాయణంలో సూపర్ మ్యాన్ ఎవరంటే తడుముకోకుండా హనుమంతుడని చెప్పేస్తారు. కష్టం ఎక్కడుంటే అక్కడకు రయ్‌మంటూ ఎగురుకుంటూ వెళ్లిపోయి అక్కడ వాలిపోతాడు. మరి రామాయణాన్ని కలియుగంలోని సూపర్ మ్యాన్‌ని మిక్స్ చేసి కథ చెబితే ఎలా ఉంటుంది? అంటే అదొక వినూత్నమైన ఆలోచన అని చెప్పాలి. దానికి పదును పెట్టి సినిమాగా తీసిన దర్శకుడి పేరు పూర్వజ్. ఇంతకీ ఆ సినిమా ఏంటంటారా? ‘ఏ మాస్టర్ పీస్’.

మాస్టర్ పీస్ (Masterpiece) అంటే సరిపోతుంది కదా.. దానికి ముందు ‘ఏ’ ఏంటి? అంటారా? దానికీ ఓ కథ ఉంది. శ్రీరాముడి (Lord Srirama) మంత్రుల్లో ఒకరి పేరు ఏతో ప్రారంభమవుతుందట. ఆ మంత్రి ఎవరనేది మాత్రం చెప్పనని పూర్వజ్ (Director Purvaj) తెలిపారు. వాస్తవానికి శ్రీరాముడి మంత్రులు చాలా మంది ఉన్నారు. మరి వారిలో పూర్వజ్ చెబుదామనుకున్న మంత్రి ఎవరనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ క్లైమాక్స్‌కు చేరుకుంది. ఈ క్రమంలోనే షూటింగ్ కవరేజ్‌కు మీడియాను ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో దర్శకుడు పూర్వజ్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

ఈ చిత్ర కథను మన పురాణాల (Puranas) నుంచి స్ఫూర్తి పొంది తయారు చేసినట్టు పూర్వజ్ తెలిపారు. దశరథ మహారాజు (Dasaratha Maharaju) మంత్రుల్లో సుమంత్రుడు ఒకరు. శ్రీరాముడు వనవాసానికి వెళ్తున్న సమయంలో సుమంత్రుడికి ఒక వరం లభిస్తుంది. ఆ వరం నేపథ్యంలోనే ఈ సినిమాను రూపొందించినట్టు పూర్వజ్ తెలిపారు. శ్రీరాముడి త్రేతాయుగా (Tretayug)నికి, హిరణ్యకశ్యపుడి (Hiranyakasyapa) ద్వాపర యుగా (Dwapara Yuga)నికి, ఇప్పటి కలియుగం (Kaliyuga)తో అనుసంధానిస్తూ ఈ కథ సాగుతుంది. ఇప్పటి వరకూ ఇలాంటి కథ వచ్చింది లేదు. నిజంగా ఇది ఆసక్తికరమే. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ కథలో శివుడి నేపథ్యం కూడా ఉంటుంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ సినిమాను మహాశివరాత్రి (Mahashivaratri) పర్వదినం సందర్భంగా విడుదల చేయాలని భావిస్తున్నట్టు తెలిపారు.

అనివార్య కారణాలతో మా సినిమా షూటింగ్ కొంత ఆలస్యమైందని ఈ చిత్ర హీరో అరవింద్ కృష్ణ తెలిపాడు. షూటింగ్ సమయంలో కొన్ని సార్లు తాను గాయపడ్డానని.. దీంతో షూటింగ్ వాయిదా వేయాల్సి వచ్చిందని వెల్లడించాడు. తను మాత్రమే కాకుండా టీంలో కొందరు సైతం కొన్ని సమస్యలు ఎదుర్కొన్నారని అవన్నీ గుర్తొస్తే తాను ఎమోషనల్ అవుతానని అరవింద్ తెలిపాడు. తమ సినిమా టీజర్ రిలీజ్ చేసి 14 నెలల తర్వాత క్లైమాక్స్ షూటింగ్ చేస్తున్నట్టు సూపర్ విలన్, ప్రొడ్యూసర్ మనీష్ గిలాడ వెల్లడించారు. రేపటి కల్లా షూటింగ్ పూర్తవుతుందని.. పోస్ట్ ప్రొడక్షన్ కూడా హై క్వాలిటీతో చేయబోతున్నట్టు వెల్లడించారు.

తాను రెండేళ్ల క్రితం ఈ ప్రాజెక్టులోకి వచ్చినట్టు హీరోయిన్ జ్యోతి పూర్వాజ్ తెలిపింది. మంచి స్క్రిప్ట్‌తో వస్తున్న ఈ చిత్రంలో తన క్యారెక్టర్ డిఫరెంట్ వేరియేషన్స్‌లో ఉంటుందని వెల్లడించింది. నటిగా తనకు మంచి సంతృప్తినిచ్చిన చిత్రం ఇదని పేర్కొన్నారు. మైథాలజీని, సూపర్ హీరో జానర్‌తో మిక్స్ చేసి రూపొందించిన చిత్రంగా ‘ఏ మాస్టర్ పీస్’ను పేర్కొంది. మలయాళంలో మిన్నల్ మురళీ సినిమా వచ్చాక అలాంటి ఒక సూపర్ హీరో చిత్రాన్ని మనం తెలుగులో ఎందుకు చేయకూడదనే ఆలోచనతో ఈ సినిమాను ప్రారంభించినట్టు ప్రొడ్యూసర్ శ్రీకాంత్ కండ్రేగుల తెలిపారు. ఈ సినిమా కోసం హాలీవుడ్‌లో సైతం వినియోగించని టెక్నాలజీని వినియోగిస్తున్నట్టు వెల్లడించారు.

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
September 8, 2025 3:24 PM